యువత శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2023-06-13T00:34:56+05:30 IST

యువత శారీరక దృఢత్వంపై దృష్టి సారిస్తే ఆరోగ్యంగా ఉంటారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐటీఐ నుంచి జెండా చౌరస్తా, కమాన్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం వరకు నిర్వహించిన తెలంగాణ 2కే రన్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

యువత శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి
2 కే రన్‌ ను జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దాసరి

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి

పెద్దపల్లి టౌన్‌ జూన్‌ 12: యువత శారీరక దృఢత్వంపై దృష్టి సారిస్తే ఆరోగ్యంగా ఉంటారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐటీఐ నుంచి జెండా చౌరస్తా, కమాన్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం వరకు నిర్వహించిన తెలంగాణ 2కే రన్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యువతను భాగస్వామ్యం చేస్తూ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్‌ నిర్వహించినట్లు ఆయన వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ.. దేశంలోనే మన పోలీసు వ్యవస్థను సీఎం కేసీఆర్‌ అగ్రగామిగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్‌, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ మమతారెడ్డి, సీఐ ప్రదీప్‌, అనిల్‌కుమార్‌, ఎస్‌ఐ మహేందర్‌, విజయేందర్‌, శ్రీనివాస్‌, మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి జే భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-13T00:34:56+05:30 IST