ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి
ABN , First Publish Date - 2023-06-26T00:56:18+05:30 IST
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డేన్‌లో ఆదివారం డీజిల్ ఆటో సంక్షేమ సంఘం నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల టౌన్ , జూన్ 25 : ఆటో డ్రైవర్ల సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డేన్‌లో ఆదివారం డీజిల్ ఆటో సంక్షేమ సంఘం నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని టాక్స్‌ను రద్దు చేసిందన్నారు. ఆటో డ్రైవర్లు తప్పని సరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి మున్సిపల్ చైర్మన్ గోళి శ్రీనివాస్, కౌన్సిలరర్ చాంద్ పాష, డీజిల్ ఆటో సంక్షేమ సంఘం అధ్యక్షుడు శెట్టి శ్రీనివాస్ ఉన్నారు.