మహిళలకు టీ డయాగ్నస్టిక్స్‌ ద్వారా పరీక్షలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2023-03-25T23:51:01+05:30 IST

ఆరోగ్య మహిళా కేంద్రాలకు వచ్చే మహిళలకు అన్ని పరీక్షలను టీ డయాగ్నస్టిక్స్‌ ద్వారా నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

మహిళలకు టీ డయాగ్నస్టిక్స్‌ ద్వారా పరీక్షలు నిర్వహించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆరోగ్య మహిళా కేంద్రాలకు వచ్చే మహిళలకు అన్ని పరీక్షలను టీ డయాగ్నస్టిక్స్‌ ద్వారా నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లాలో ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించుకుని, రిఫరల్‌ సర్వీసెస్‌ ఉపయోగించుకున్నారని తెలిపారు. ఆరోగ్య, మెప్మా, మార్కెటింగ్‌, డీర్‌డీఏ, మున్సిపాలిటీ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని మహిళలు ఉపయోగించుకునే విధంగా చూడాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ప్రియాంక, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, జిల్లా సంక్షేమాధికారి సబితా, జిల్లా మార్కెటింగ్‌ అధికారి పద్మావతి, మెప్మా పీడీ రవీందర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత పాల్గొన్నారు.

డైనమిక్‌ లైటింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

కరీంనగర్‌ టౌన్‌: కేబుల్‌ బ్రిడ్జి డైనమిక్‌ లైటింగ్‌ సిస్టం పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ కాంట్రాక్టర్లను, ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కేబుల్‌ బ్రిడ్జిపై ఏర్పాటు చేస్తున్న డైనమిక్‌ లైటింగ్‌ పనులను, అప్రోచ్‌ రోడ్డు, బ్రిడ్జి లింకేజీ పనులను కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదనంగా మిషనరీ, కార్మికులను డైనమిక్‌ లైటింగ్‌, నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు, కాంట్రాక్టర్‌ జమాలుద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:51:01+05:30 IST