నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు
ABN , First Publish Date - 2023-11-21T23:33:23+05:30 IST
నగరంలోని టూ టౌన్ పరిధిలోని పలు కాలనీలు, వీధుల్లో మంగళవారం రాత్రి స్థానిక పోలీసులతోపాటు స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

కరీంనగర్ క్రైం, నవంబరు 21: నగరంలోని టూ టౌన్ పరిధిలోని పలు కాలనీలు, వీధుల్లో మంగళవారం రాత్రి స్థానిక పోలీసులతోపాటు స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం వదిలిపెట్టారు. ఈ సందర్భంగా సీపీ అభిషేక్ మొహంతి మాట్లాడుతూ ఓల్డ్‌లేబర్ అడ్డా, న్యూ లేబర్ అడ్డా, విద్యానగర్, రాంనగర్, చైతన్యపురి, భాగ్యనగర్, సంతోష్‌నగర్, వీధుల్లో తనిఖీలు, ఫుట్‌మార్చ్ నిర్వహించామన్నారు. ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కోడ్ ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ జి నరేందర్, వన్ టౌన్ సీఐ రవికుమార్, టూ టౌన్ సీఐ రాంచందర్ రావు పాల్గొన్నారు.
ఫ త్రీ టౌన్ ఆకస్మిక తనిఖీ
కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సీపీ అభిషేక్ మొహంతి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, ఎన్నికల నేరస్థుల, రౌడీ షీటర్ల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అవసరమైన అన్నీ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు లు నిర్వహించాలన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని, గుర్తిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. నిఘా వ్యవస్థను పటిష్ట పరచి అనుమతి లేని సమావేశాలు, విందులు, అక్రమ పంపిణీలను గుర్తించి భాద్యులతో పాటు సహకరించిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో పక్షపాత వైఖరి ప్రదర్శించినా, నిర్లక్ష్యంగా వ్యవహారించినా శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ వి శ్రీనివాస్, ఎస్‌ఐలు మామిడాల సురేందర్, రమేష్ పాల్గొన్నారు.