జర్నలిస్టుల విశ్వాసాన్ని కాపాడుకుంటాం

ABN , First Publish Date - 2023-05-27T00:08:15+05:30 IST

అరవై ఏళ్లుగా జర్నలిస్టులు తమపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే, ఐజే యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరామాత్‌ అలి స్పష్టం చేశారు.

జర్నలిస్టుల విశ్వాసాన్ని కాపాడుకుంటాం
మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ

వేములవాడ టౌన్‌, మే 26: అరవై ఏళ్లుగా జర్నలిస్టులు తమపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే, ఐజే యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరామాత్‌ అలి స్పష్టం చేశారు. వేములవాడ పట్టణంలోని బీమేశ్వరగార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే సిరిసిల్ల జిల్లా ద్వితీయ మహాసభలో మాట్లాడారు. రాజీలేని పోరాటా లు, త్యాగాలతో నిర్మితమైన తమ సంఘానికి 60 ఏళ్లపైబడి అనుభవం, సుదీర్ఘచరిత్ర ఉన్నాయన్నారు. నాటి నుంచి నేటి వరకు జర్నలిస్టుల సంక్షేమాన్ని ఏ ప్రభుత్వం విస్మరించినా పోరాటాలతో గుణపాఠం చెప్పామన్నారు. ఓ వైపు జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడుతూనే మరోవైపు భావప్రకటన స్వేచ్ఛ, పత్రిక స్వేచ్ఛ కోసం ఉద్యమి స్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జర్నలిస్టులు పొందు తున్న సౌకర్యాలన్నీ తమ సంఘం పోరాట ఫలిత మేనన్నారు. రాష్ట్రానికి ప్రెస్‌ అకాడామీ సాధించిన ఘనత తమ సంఘానిదేనన్నారు. నేడు రాష్ట్రంలో వేలాది మంది జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తూ, ఐజేయూ గొడుగు కింద దేశంలోని అతిపెద్ద యూని యన్‌గా టీయూడబ్ల్యూజే గుర్తింపు పొందడం రాష్ట్రా నికే గర్వకారణం అన్నారు. జర్నలిస్టుల కనీస సౌకర్యా లైన ఇంటి స్థలాలు, ఇళ్లు, ఆరోగ్యభద్రత, పిల్లలకు ఉచిత విద్య, వేజ్‌బోర్డు అమలు, విశ్రాంత జర్నలిస్టులకు పింఛన్‌ వంటి పథకాలను సాధించుకునే వరకు పోరా డుతామని ప్రతిజ్ఞ చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్‌ మాట్లాడుతూ మీడియా విస్త రించడం శభపరిణామమని, కానీ దాని ముసుగులో కొన్ని శక్తులు పవిత్రమైన వృత్తికి చెడ్డపేరు తీసుకురావడం సహించరానిదని అన్నారు. అలాంటి శక్తులను అదపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే తమ సంఘం స్థాపించిన మెఫి సంస్థ నుంచి జర్నలిస్టులకు నైతిక విలువలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికలు మ్యాగ్‌జైన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యూసూఫ్‌ బాబు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చిన్న పత్రికల మనుగడకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తూ వాటిని కాపాడుకోవాలని కోరారు. దాడుల వ్యతిరేఖ కమిటీ కన్వీనర్‌ అయిలు రమేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చిన్నాచితక జర్నలిస్టు సంఘాలు ఆవిర్భ వించినా టీయూడబ్ల్యూజే-ఐజేయూ సంఘాన్నే జర్నలి స్టులు ఆదరిస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కర్ణాల భద్రాచలం, జిల్లా కార్యదర్శి దాసరి దేవేందర్‌, కోశాధికారి కాంబోజు ముత్యం, రేగుల దేవేందర్‌, పుట్టపాక లక్ష్మణ్‌, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:08:15+05:30 IST