Share News

అభివృద్ధే ధ్యేయంగా పనిచేశాం

ABN , First Publish Date - 2023-11-19T23:23:44+05:30 IST

సబ్బండ వర్గాల అభి వృద్ధే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌ పార్టీ పని చేసిందని ఎమ్మె ల్సీ, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కవిత పేర్కొ న్నారు.

అభివృద్ధే ధ్యేయంగా పనిచేశాం

రామగిరి, నవంబరు 19: సబ్బండ వర్గాల అభి వృద్ధే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌ పార్టీ పని చేసిందని ఎమ్మె ల్సీ, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కవిత పేర్కొ న్నారు. ఆదివారం మండ లంలోని సెంటినరీకాలనీ వాణి పాఠశాల ప్రాంగణం లో నిర్వహించిన ఆశీర్వాద సభలో ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. తె లంగాణ రాష్ట్రానికి ఆయువుపట్టుగా ఉన్న సింగ రేణిని కాంగ్రెస్‌ హయాంలో కేంద్రానికి 49 శాతం కేం ద్రానికి తాకట్టు పెట్టిందన్నారు. అదేవిధంగా ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టిన ఘనత కాంగ్రెస్‌ పాలకులకే దక్కిందన్నారు. గత ఎన్నికల్లో పుట్ట మధు ఓటమి చవి చూసిన అనేక అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టారన్నారు. మంథని అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సిద్ధ మేనా అని కవిత సవాల్‌ విసిరారు. అందరివా డుగా ఉన్న పుట్ట మధును భారీ మెజార్టీతో ప్రజ లు గెలిపించుకో వాలని పిలుపునిచ్చారు. ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంక ట్రావ్‌, జనరల్‌ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శంకేషీరవిందర్‌, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పం చ్‌లు,నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Updated Date - 2023-11-19T23:23:58+05:30 IST