Share News

కోల్‌ఇండియాలో లేని హక్కులు సాధించాం

ABN , Publish Date - Dec 19 , 2023 | 12:04 AM

కోల్‌ ఇండియాలో లేని హక్కులను సింగరేణిలో సాధించిన ఘనత టీబీజీకేఎస్‌దేనని యూనియన్‌ జనర ల్‌ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి తెలిపారు.

కోల్‌ఇండియాలో లేని హక్కులు సాధించాం

రామగిరి, డిసెంబరు 18: కోల్‌ ఇండియాలో లేని హక్కులను సింగరేణిలో సాధించిన ఘనత టీబీజీకేఎస్‌దేనని యూనియన్‌ జనర ల్‌ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. సోమవారం సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-2లో ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. జాతీయ సంఘాలుగా ఉన్నా కార్మికుల సమస్య లపై ఏనాడు పోరాటం చేసిందిలేదని ఆరోపించారు. ఏరియాల్లో కార్మి కులను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా కార్మికుల హక్కులు సాధిస్తామంటు గేట్‌మీటింగుల్లో చెప్పుకుంటున్నారని విమర్శించారు. కోల్‌ఇండియాలో విద్యుత్‌ చెల్లింపుల పేర కార్మికులకు 1శాతం వేత నాల్లో కోతలు విధిస్తున్నా సింగరేణిలో ఆ పరిస్థితి రాకుండా టీబీజీకే ఎస్‌ చొరవ చూపిందని పేర్కొన్నారు. కూట్లో రాయి తీయని జాతీయ సంఘాలు ఏట్లో రాయి తీస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ ప్రచా రం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఒక్కో పర్సెంటేజీ విద్యుత్‌ వేతనా ల కోతలతో ప్రతి కార్మికుడి 13వందల మేరకు చెల్లించే పరిస్థితిని దూరం చేసినట్లు పేర్కోన్నారు. కార్మికుడి కుటుంబాలకు ఏసీ సౌకర్యం కల్పించిన ఘనత టీబీజీకేఎస్‌ నాయకత్వనికే దక్కుతుందన్నారు. జాతీ య సంఘాల మాయమాటాలు నమ్మి మోసపొవద్దని పేర్కొన్నారు. రాబోయే గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను బలపర్చాలని మిర్యాల రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్‌ నాయకులు గౌతం శంకరయ్య, రవీశంకర్‌, రహిమోద్దీన్‌, మహేందర్‌రెడ్డి, సురేష్‌, నరేష్‌, సహదేవ్‌, సతీష్‌, బీమయ్య, తిరుపతి, సత్యనారయణ, రాయ మల్లు, లక్ష్మయ్య, హుస్సేన్‌ తదితరులు పాల్గోన్నారు.

Updated Date - Dec 19 , 2023 | 12:04 AM