ఆసరా కోసం ఎదురుచూపులు
ABN , First Publish Date - 2023-06-26T01:10:06+05:30 IST
అర్హులైన వ్యక్తులకు ఆసరా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, ఎ యిడ్స్ బాధితులు, బోధకాలు బాధితులు, డయాలిసిస్ బాధితులు తది తర వర్గాలకు అండగా నిలిచేందుకు గాను ప్రభుత్వం ఆసరా పథకం ద్వా రా పింఛన్ అందిస్తోంది.
- కొత్తవారికి దరఖాస్తు ఇక్కట్లు
- ఏళ్లుగా తెరుచుకోని వెబ్‌సైట్
- కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అర్హులు
- గ్రీవెన్స్ ఆర్జీల్లో ఇవే అధికం
- జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మందికి పైగా నిరీక్షణ
జగిత్యాల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): అర్హులైన వ్యక్తులకు ఆసరా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, ఎ యిడ్స్ బాధితులు, బోధకాలు బాధితులు, డయాలిసిస్ బాధితులు తది తర వర్గాలకు అండగా నిలిచేందుకు గాను ప్రభుత్వం ఆసరా పథకం ద్వా రా పింఛన్ అందిస్తోంది. కొత్తగా అర్హులైన వారికి ఏళ్లుగా నిరీక్షణ తప్ప డం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉ న్నారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌లో అందే ఆర్జీ ల్లో ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. మండల స్థాయిలో అధికారులను కలి సి వేడుకుంటున్న అర్హులైన వారికి పైనుంచే మంజూరు కావడం లేదనే సమాధానం వినిపిస్తుంది. ఈ క్రమంలో వారంతా కలెక్టరేట్‌కు చేరుకుని ఉన్నతాధికారులకు తమ గోడు విన్నవిస్తున్నారు. మరోవైపు ఇందుకోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను ప్రభుత్వం నిలిపి వేయడంతో కనీసం దరఖా స్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటికే డీఆర్డీవో పరిధిలో పలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
జిల్లాలో ఆసరా పింఛన్ల సంఖ్య..
జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెల 8,01,682 మందికి ప్రభుత్వం ప్రస్తుతం ఆసరా పింఛన్లు అందిస్తోంది. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 6,41,896 మం దికి, వితంతు 44,844, గీత కార్మికులు 3,448, చేనేత కార్మికులు 2,270 మంది, బీడీ కార్మికులు 89,105, ఎయిడ్స్ బాధితులు 750, బోదకాలు బా ధితులు 1,797, డయాలసిస్ బాధితులు 83, దివ్యాంగులు 17,489 మంది ఉన్నారు. ఇందుకు ప్రతీ నెల 47.83 కోట్లు ప్రభుత్వం వెచ్చింస్తోంది.
గతంలో ఇలా...
పింఛన్‌కు అర్హులైన వారు గతంలో గ్రామీణులైతే మండల పరిషత్, పట్టణ పరిధిలోని వారైతే మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే వారు. ఆయా కార్యాలయాల్లో అందిన దరఖాస్తులను సిబ్బంది క్షేత్రస్థాయి లో విచారణ చేపట్టి అర్హులైనట్లుగా తేలితే వారి పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసేవారు. అలాంటి వారి వివరాలను డీఆర్‌డీఏకు, అక్కడి నుంచి సెర్ఫ్ కార్యాలయానికి పంపించే వారు. అక్కడి నుంచి పింఛన్ మంజూరయ్యేది. ప్రభుత్వం 2019 జూలైలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ను నిలిపి వేసింది. దీంతో మండల, మున్సిపల్ అధి కారులు కొత్తగా ఎటువంటి దరఖాస్తులు స్వీకరించడం లేదు. పింఛన్ అర్హత వయస్సును తగ్గించిన సందర్బంగా జిల్లాలో కొంత మందికి కొత్తగా ఆసరా మంజూరు చేశారు. అప్పటికే అందిన దరఖాస్తుల నుంచి హుజూ రాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం కొందరికి కొత్త పింఛన్లను మంజూరు చేసింది. మరి కొందరివి పెండింగ్‌లో ఉన్నాయి. తర్వాత అర్హు లైన వారికి దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్ సైతం అందుబాటులో లేకపోవడంతో వారంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఓల్డ్ ఏజ్ పింఛన్ స్పౌజ్‌కు అనుమతి..
జిల్లాలో కొత్త పింఛన్ దరఖాస్తులు స్వీకరించని ప్రభుత్వం ఇటీవల (ఓల్డ్ ఏజ్ పింఛన్) స్పౌజ్ పింఛన్ మంజూరుకు అనుమతినిచ్చింది. ఓఏపీ పొందే వారిలో జీవిత భాగస్వామి మరణిస్తే మరొకరికి పింఛన్ మంజూరు చేస్తున్నారు. భార్య మరణిస్తే భర్తకు, భర్త మరణిస్తే భార్యకు పది హేను రోజుల్లోగా పింఛన్ అందివ్వాలని సర్కారు పెద్దల ఆదేశాల మేరకు అందిస్తున్నారు. దివ్యాంగుల విషయంలో ఇది వర్తించకపోవడంతో వారిని ఆందోళనకు గురిచేస్తోంది. వైకల్యం కలిగిన దివ్యాంగులను పలు సందర్భాల్లో సకలాంగులు వివాహం చేసుకొని జీవిస్తున్నారు. ఇందులో చాలా మంది పరిస్థితి అధ్వానంగా ఉంది. దివ్యాంగులైన పింఛన్ దారులు మరణిస్తే ఆ కుటుంబం కష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. స్పౌజ్ పింఛన్‌ను దివ్యాంగులకు సైతం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారం..
ప్రభుత్వం పింఛన్ దరఖాస్తును నిలిపివేసింది. దీంతో కొత్తగా దరఖా స్తులు స్వీకరించేందుకు ఎలాంటి అవకాశం ఉండడం లేదు. విషయం తె లియక చాలామంది కార్యాలయాలకు వెళ్లి అధికారులకు నివేదిస్తున్నారు. ప్రభుత్వ ఆదే శాల మేరకే పింఛన్ మంజూరవుతుందని అధికారులు వి వరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ఆన్‌లైన్ చేసిన పలు దరఖాస్తులు సై తం పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు జారీ చేస్తే అ ప్పుడు కొత్త పింఛన్లు మంజూరు అయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలో సు మారు లక్ష వరకు కొత్త పింఛన్‌కు అర్హులైన వ్యక్తులు ఎదురుచూపులతో గడుపుతున్నారన్న అంచనా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించి అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని పలు వురు కోరుతున్నారు.
అర్హులకు ఆసరా అందించాలి
- బ్రాహ్మణపల్లి శంకర్, వృద్ధుడు, వెల్గొండ గ్రామం
అర్హులందరికి ఆసరా పింఛన్లు అందించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాను. కనీసం ఆన్‌లైన్ చేయడానికి సైతం నోచుకోలేదు. ప్రభు త్వం సంబంధిత సర్వర్‌ను మూసివేయడంతో ఇబ్బందులు తలె త్తుతు న్నాయి. ఎప్పటికప్పుడు దరఖాస్తులు స్వీకరించడం, అర్హులందరకి అందిం చడం చేయాలి.
ఆరు నెలలయినా ఆసరా అందలే..
- చెట్‌పల్లి గంగాధర్, దివ్యాంగుడు, బుగ్గారం
ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని ఆరు నెలలు అవుతోంది. సదరం సర్టిఫికేట్ అందిన వెంటనే ఆసరా కోసం దరఖాస్తు చేసుకున్నాను. పింఛన్ అందించడంలో తీవ్రజాప్యం నెలకొం టోంది. ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులందరికి ఆసరా పింఛన్ అందిం చేలా చర్యలు తీసుకోవాలి.