బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే రాష్ట్రం అమ్ముడుపోతుంది
ABN , First Publish Date - 2023-11-19T23:18:41+05:30 IST
రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే హైదరా బాద్‌లో కోట్లాది విలువ చేసే భూములు అమ్ముకున్నారని, మళ్లీ ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణా రావు అన్నారు.
ఓదెల, నవంబరు 19 : రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే హైదరా బాద్‌లో కోట్లాది విలువ చేసే భూములు అమ్ముకున్నారని, మళ్లీ ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణా రావు అన్నారు. మండలంలోని గుండ్లపల్లి, కనగర్తి, మడక, పొత్కపల్లి, లంబాడితండా, అబ్బిడిపల్లి గ్రామాల్లో ఆదివారం విజయరమణారావు ప్ర చారం నిర్వహించారు. ప్రజలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికా రు. అనంతరం కూడళ్లలో మాట్లాడుతూ వేల కోట్ల విలువచేసే సహజ సంపదను ఎమ్మెల్యేతోపాటు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుందన్నారు. నియోజ కవర్గంలో ముఖ్యంగా ఓదెల మండలంలో ఇసుక రీచ్‌ల వల్ల మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలు నరకయాతన అనుభవించారని తెలిపారు. ఇసుకతో ప్రజలకంటే ఎక్కువ ఇక్కడ ఉన్న బీఆర్‌ఎస్ నాయకులంతా మధ్య దళారులతో లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించారని, గ్రా మాల్లో రైతుల బతుకులను ఆగం చేశారన్నారు. గ్రూప్-1 పేరుతో యువ తను మోసం చేశారని, ఇంటికో ఉద్యోగం పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచారని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని రకాలుగా ప్రజలు మోసపోతున్నారని ప్రశ్నించిన వారిని పోలీ సులతో బెదిరించిన చరిత్ర ఉందన్నారు. రెండుసార్లు ఓడినా కూడా ప్రజలకు అండగా నిలిచానని రైతులకు అందుబాటు లో ఉండి సాగునీటి కోసం కష్టపడ్డానన్నారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయినా, కేసీఆర్ అయినా రైతులకు పంట నష్టపరిహరం అందించలేకపోయారన్నారు. ఎమ్మెల్యేతోపాటు ప్రభుత్వానికి ఓటమిభయం పట్టుకుందని, దీంతో నకిలీ పత్రా లు సృష్టించి తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేయాల ని చూస్తున్నారన్నారు. కాళేశ్వరం నీరు ఈప్రాంత రైతులకు ఉపయోగం లేకున్నా అక్కడి విద్యుత్ బిల్లులు, నీటిపన్ను ఈ నియోజకవర్గ ప్రజలపై రుద్దుతున్నారని తెలిపారు. అలాగే మద్యం టెండర్ల ద్వారా వచ్చిన వేల కోట్లను ఎన్నికలకు ఉప యోగించుకొని ఓట్ల కొనుగోలు పాల్పడుతున్నా రని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యా రంటీ పథకాలను గెలిచిన వెంటనే అమలుచే సి తీరుతామన్నారు. అక్రమాలు లేని పాలన, దళారీ వ్యవస్థ లేని పాలన అందించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. హస్తం గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టితో గెలి పించాలని కోరారు. సాగర్‌రెడ్డి, పుప్పాల శంక ర్, ఆళ్ల సుమన్‌రెడ్డి, చొప్పరి రాజయ్య, కోట నిరంజన్‌రెడ్డి, రెడ్డి రజనికాంత్, గోసిక రాజేశం, అంబాల కొమురయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.