స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం పర్యటన

ABN , First Publish Date - 2023-08-06T00:20:11+05:30 IST

మండలంలోని తాండ్ర్యాల, దుంపెట గ్రామాల్లో శనివారం స్వచ్ఛ సర్వేక్షణ్‌ కేంద్ర బృందం పర్యటించింది

 స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం పర్యటన
తాండ్ర్యాలలో కేంద్ర బృందానికి స్వాగతం పలుకుతున్న సర్పంచ్‌

కథలాపూర్‌, ఆగస్టు 5 : మండలంలోని తాండ్ర్యాల, దుంపెట గ్రామాల్లో శనివారం స్వచ్ఛ సర్వేక్షణ్‌ కేంద్ర బృందం పర్యటించింది. గ్రామపంచాయతీల కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించిన వ్యక్తిగత మరు గుదొడ్లు, ఇంకుడు గుంతలు, సానిటేషన్‌ వంటివి పరిశీలించారు. వ్యక్తిగత మ రుగుదొడ్ల వినియోగం, ఇంకుడు గుంతల వల్ల ఏర్పడిన ప్రయోజనాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏ మేరకు గ్రామీణులు సద్వినియోగం చేసుకుంటున్నారనే వివరాలు అడిగి యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకున్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, మరుగుదొడ్ల వినియోగం గురించి ఆరా తీశారు. కేంద్ర బృందంతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులు, ఎంపీ డీవో జనార్దన్‌, ఏపీఎం నరహరి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. సర్పం చులు గడీల గంగప్రసాద్‌, అంబటి లతపురుషోత్తం కేంద్ర బృందం సభ్యుల కు పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానించారు.

================

కేంద్ర ప్రభుత్వ తనిఖీ బృందం ఆకస్మిక పర్యటన

ధర్మపురి, ఆగస్టు 5: ధర్మపురి మండలంలోని తీగలధర్మారం గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్‌ గ్రామీణ 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ తనిఖీ బృందం సభ్యులు ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేశారు. గ్రామంలో మెయిన్‌ రోడ్‌, ఇంటర్నల్‌ రోడ్‌, ప్రతి వీధిలో డ్రైనేజీ క్లీనింగ్‌, పబ్లిక్‌ స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయ ఆస్తులు, కమ్యూనిటీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు, వ్యక్తి గత మరుగుదొడ్లు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అంటూ తెలుసుకున్నారు. గ్రామంలో కంపోస్ట్‌ షెడ్‌ ఉపయోగిస్తున్నారా లేదా ఇంకా లేని వారు ఎంత మంది ఉన్నారనే తదితర అంశాల గురంచి అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్‌ అయిల్నేని ఆండాళు-ప్రభాకర్‌రావు, స్వచ్ఛ సర్వేక్షన్‌ టీమ్‌ సభ్యులు చిరంజీవి, సెంట్రల్‌ టీమ్‌ ఆఫీసర్‌ సాయికుమార్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎంపీవో నరేష్‌కుమార్‌, స్వచ్ఛ సర్వేక్షన్‌ టీమ్‌ సభ్యులు చిరంజీవి, ఈజీఎస్‌ ఏపీవో సృజన్‌, ఐకేపీ ఏపీఎం రమాదేవి, ఉపసర్పంచ్‌ పందిరి అశోక్‌, పంచాయితీ కార్యదర్శి నవీన్‌, ఈజీఎస్‌ ఫీల్డు అసిస్టెంట్‌ సంతోష్‌, ఎంపీడబ్ల్యు రాజలింగం పాల్గొన్నారు.

జగిత్యాలరూరల్‌, ఆగస్టు 5 : జగిత్యాల రూరల్‌ మండలంలోని చల్‌గల్‌, పొరండ్ల గ్రామాల్లో సెంట్రల్‌ స్వచ్చ సర్వేక్షణ్‌ బృంద సభ్యులు శ్రీనివాస్‌, ప్రవళిక శనివారం పర్యటించారు. పారిశుధ్యం తడిపొడిచెత్తసేకరణ, ఇంకుడుగుంతల నిర్మాణం, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డిసౌకర్యం, సేంద్రియ ఎరువుల తయారీ, తదితర అంశాలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో అడిషనల్‌ పీడీ పల్లికొండ నరేష్‌, ఎంపీడీవో రాజేశ్వరి, సర్పంచులు గంగనర్సురాజన్న, సంధ్యారాణిశ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవోలు సలీం, రవిబాబు, ఏపీఎం ఓదెల గంగాధర్‌, ఇజిఎస్‌ ఏపీఓలు దయాకర్‌, లక్ష్మణ్‌. పంచాయితీ కార్యదర్శి మహేష్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-06T00:20:11+05:30 IST