ఎన్టీపీసీలో స్వతంత్ర డైరెక్టర్ల పర్యటన
ABN , First Publish Date - 2023-06-26T23:53:09+05:30 IST
: ఎన్టీపీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్లు విద్యాధర్, జయంతిలాల్, సంగీత వారియర్ ఆది, సోమవారాల్లో రామగుండం ఎన్టీపీసీలో పర్యటించారు. ఈ సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ, తెలంగాణ ఎన్టీపీసీ(టీఎస్‌టీపీపీ) నిర్మాణ పనులు, సీఎస్‌ఆర్ పనులను డైరెక్టర్లు పరిశీలించారు.
- టీఎస్‌టీపీపీ, సీఎస్‌ఆర్ పనుల పరిశీలన
జ్యోతినగర్, జూన్ 26: ఎన్టీపీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్లు విద్యాధర్, జయంతిలాల్, సంగీత వారియర్ ఆది, సోమవారాల్లో రామగుండం ఎన్టీపీసీలో పర్యటించారు. ఈ సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ, తెలంగాణ ఎన్టీపీసీ(టీఎస్‌టీపీపీ) నిర్మాణ పనులు, సీఎస్‌ఆర్ పనులను డైరెక్టర్లు పరిశీలించారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని డైరెక్టర్లు సందర్శించారు. ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ కింద నిర్మించిన 50 పడకల వార్డును తనిఖీ చేశారు. ఎన్టీపీసీ సమకూర్చిన వైద్య పరికరాలను పరిశీంచారు. అనంతరం 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టును సందర్శించారు. కుందనపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని స్వతంత్ర డైరెక్టర్లు సందర్శించి ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన 200 పడకల డార్మెట్రీ హస్టల్‌ను తనిఖీ చేశారు. బమ్లా నాయక్ తండాలో సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును డైరెక్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఎన్టీపీసీ కల్పించే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు(టీఎస్‌టీపీపీ)లోని టర్బయిన్, జనరేటర్ హాల్, కంట్రోల్ రూంలను డైరెక్టర్లు పరిశీలించారు. డైరెక్టర్ల గౌరవార్థం కాకతీయ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం కాజిపల్లి సమీపంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూపొందించిన మియావాకి ప్లాంటేషన్‌లో డైరెక్టర్లు పర్యటించారు. హైదరాబాద్‌కు వెళ్లే ముందు పీటీఎస్‌లోని ఫ్రూట్ గార్డెన్‌లో వారు మొక్కలు నాటారు. స్వతంత్ర డైరెక్టర్ల వెంట రావగుండం ఎన్టీపీసీ ఈడీ సునీల్‌కుమార్, జీఎంలు, ఏజీఎం(హెచ్‌ఆర్) సిక్దర్, అధికారు పాల్గొన్నారు.