వెలిచాల గ్రామపంచాయతీకి రెండు ఐఎస్‌వో అవార్డులు
ABN , First Publish Date - 2023-06-23T00:00:26+05:30 IST
జిల్లాలోని రామడుగు మండలం వెలిచాల గ్రామపంచాయతీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఐఎస్‌వో) రెండు ఐఎస్‌వో అవార్డులకు ఎంపిక చేసింది.
కరీంనగర్ టౌన్, జూన్ 22: జిల్లాలోని రామడుగు మండలం వెలిచాల గ్రామపంచాయతీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఐఎస్‌వో) రెండు ఐఎస్‌వో అవార్డులకు ఎంపిక చేసింది. ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికై అవార్డును తీసుకున్నందుకుగాను ఐఎస్‌వో 9001-2015, పచ్చదనం పరిశుభ్రతలో ఐఎస్‌వో 14001-2015 అవార్డులను ప్రకటించింది. గురువారం ఈ మేరకు ఆ రెండు అవార్డులను కరీంనగర్‌లో వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్‌రావుకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీ సీఈవో ప్రియాంక కర్ణన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, రామడుగు జడ్పీటీసీ మార్కొండ లక్ష్మీకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- తిమ్మాపూర్ మండలంలో మూడు పంచాయతీలకు
తిమ్మాపూర్: మండలంలోని మూడు గ్రామ పంచాయతీలు పలు విభాగాల్లో ఐఎస్‌వో-9001 సర్టిఫికెట్లు సాధించాయి. గురువారం ఆయా గ్రామాల సర్పంచ్‌లు మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకున్నారు. తిమ్మాపూర్ గ్రామ పంచాయితీకి గుడ్ గవర్నెన్స్‌కు సంబంధించి ఐఎస్‌వో 9001:2015 సర్టిఫికెట్ లభించింది. సర్పంచ్ దుండ్ర నీలమ్మ, ఎంపీపీ కేతిరెడ్డి వనిత మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. మండలంలోని మహాత్మనగర్, నుస్తులాపూర్ గ్రామ పంచాయితీలకు కూడా గుడ్ గవర్నెన్స్‌కు సంబందించి ఐఎస్‌వో 9001:2015 సర్టిఫికెట్లు లభించాయి.