కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం వందేళ్లు వెనకకు

ABN , First Publish Date - 2023-06-03T00:34:39+05:30 IST

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో తెలం గాణ వందెళ్లు వెనకకు వెళ్లిందని ఎమ్మెల్సీ, రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకు లు తాటిపర్తి జీవన్‌ రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం వందేళ్లు వెనకకు
సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

- ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి

జగిత్యాల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో తెలం గాణ వందెళ్లు వెనకకు వెళ్లిందని ఎమ్మెల్సీ, రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకు లు తాటిపర్తి జీవన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను నిర్వహించారు. ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పట్టణంలోని పలు ప్రధాన వీదుల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈసంద ర్బంగా జీవన్‌ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ అ ని కొనియాడారు. తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణకు మరో ఉద్యమం రా వాల్సిన అవసరముందన్నారు. మద్యం విక్రయాల్లో రాష్ట్రం ముందు వరసలో ఉందన్నారు. స్థానికత రిజర్వేషన్లు కల్పించకపోతే రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నీరు గారుతుందన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో స్థానిక రిజర్వేషను కనుమరుగు అయిందన్నారు. విద్యను అంగట్లో అమ్మకానికి పెట్టారని విమర్శించారు. మిగు లు బడ్జెట్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుం దన్నారు. స్కాముల్లో, ప్రాజెక్టుల అవినీతిలో రాష్ట్రం ముందుందని విమర్శిం చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సీఎం కేసీఆర్‌ కుటుంబం ఒక్కటే బంగారం అయిందని ఎద్దెవ చేశారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొని రావాలని కోరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, నాయకులు గిరి నాగభూషణం, తాటిపర్తి విజయలక్ష్మీ దేవేందర్‌ రెడ్డి, గాజెంగి నందయ్య, దుర్గయ్య, రమేశ్‌, హరికృష్ణ, శ్రీనివాస్‌, రవి, కంటాల శ్రీనివాస్‌, రమేశ్‌ బాబు, మదు, నెహాల్‌, రాధా కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:34:39+05:30 IST