తెలంగాణలో మారని గల్ఫ్‌ బతుకులు

ABN , First Publish Date - 2023-06-26T00:27:30+05:30 IST

పోరాడి సాధించుకున్న తెలంగాణలో వలస జీవితాలు మారుతాయని ఆశించిన ఆశలు నెరవేరలేవని, ఉపాధి కోసం వలసబాట పడుతూ అనేక కష్టాలు, కుటుంబ పెద్దలు మృతి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోవడం శోచనీయమని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో మారని గల్ఫ్‌ బతుకులు
మాట్లాడుతున్న కేకే మహేందర్‌రెడ్డి

ఎల్లారెడ్డిపేట, జూ న్‌ 25: పోరాడి సాధించుకున్న తెలంగాణలో వలస జీవితాలు మారుతాయని ఆశించిన ఆశలు నెరవేరలేవని, ఉపాధి కోసం వలసబాట పడుతూ అనేక కష్టాలు, కుటుంబ పెద్దలు మృతి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోవడం శోచనీయమని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే వలస బతుకులు ఆగం కావని పేర్కొన్న కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి వారి సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. బొంబా యి, బొగ్గుబాయి, దుబాయికి మన బిడ్డలు బతుకుదెరువుకు ఉన్న ఊళ్లను విడిచి పోవాలా..? అని ఉద్యమ సమయంలో మాట్లాడి ప్రస్తుతం వారి కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల దుబాయిలో గుండెపోటుతో మృతి చెందిన నవీన్‌ కుటుబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని తిరుపతి అబుదాబిలో కోమాలోకి వెళ్లి వారం రోజులు గడుస్తున్నా కోలుకోలేని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్నారు. నాయకులు నర్సయ్య, గౌస్‌, లింగాగౌడ్‌, లక్ష్మారెడ్డి, బాబు, నాగరాజు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-06-26T00:27:30+05:30 IST