జువ్వాడి సుమతీదేవికి ఘన నివాళులు

ABN , First Publish Date - 2023-06-26T01:07:22+05:30 IST

ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెం దిన దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు సతీమణి సుమతీదేవి ఇటీవల మృతి చెందగా దశ దిన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

జువ్వాడి సుమతీదేవికి ఘన నివాళులు
సతీదేవి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న మంత్రి ఈశ్వర్‌

ధర్మపురి, జూన్‌ 25: ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెం దిన దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు సతీమణి సుమతీదేవి ఇటీవల మృతి చెందగా దశ దిన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తిమ్మాపూర్‌ గ్రామానికి వెళ్లి ఆమె చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళు లర్పించారు. అనంతరం సుమతీదేవి కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. జువ్వాడి కుటుంబ సభ్యులతో ఉన్న అను బంధం గుర్తు చేసుకున్నారు. ఆయ న వెంట డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ధర్మపురి జడ్పీటీసీ బత్తిని అరుణ, సర్పంచ్‌ కాళ్ల శేఖర్‌, ఎంపీటీసీ కాళ్ల సత్తయ్య, బీఆర్‌ఎస్‌ నేత సంగి శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T01:07:22+05:30 IST