సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-02-21T23:46:25+05:30 IST

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు, డిమాండ్ల సాధన కోసం విద్యుత్‌ ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితిని (జేఏసీ) ఏర్పాటు చేసుకున్నారు.

సమస్యలు పరిష్కరించాలి
కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు

గణేశ్‌నగర్‌, ఫిబ్రవరి 21: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు, డిమాండ్ల సాధన కోసం విద్యుత్‌ ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితిని (జేఏసీ) ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం జేఏసీ కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ వేతన సవరణ పెండింగ్‌లో ఉందని, సమస్యల సాధనకు విద్యుత్తు ఉద్యోగులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వేతన సవరణ, జీపీఎఫ్‌, ఉద్యోగుల ప్రమోషన్స్‌, అలవెన్సులుు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని పరిష్కరించడంలో యాజమాన్యం సంవత్సర కాలంగా కాలయాపన చేస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించుకునేందకుఉ కరీంనగర్‌ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేశామన్నారు. జేఏసీ జిల్లా చైర్మన్‌గా సీహెచ్‌ భాస్కర్‌, కన్వీనర్‌గా నాయిని అంజయ్య, కో చైర్మ్‌న్‌గా కె శ్రీనివాస్‌, కో కన్వీనర్‌గా సంపత్‌కుమార్‌, జాయింట్‌ సెక్రెటరీగా ఎన్‌ స్వామి, కె సత్యమయ్య, కె సత్యనారాయణ, సుధీర్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈనెల 24, 25, 28, తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని మార్చి ఒకటి, రెండో తేదీల్లో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలపాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-02-21T23:46:27+05:30 IST