పట్టణ అభివృద్ధికి సహకరించాలి

ABN , First Publish Date - 2023-03-18T01:08:54+05:30 IST

ప్రజలు పన్నులు సకా లంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నా రు.

పట్టణ అభివృద్ధికి సహకరించాలి
కౌన్సిలర్లను సన్మానిస్తున్న చైర్‌ పర్సన్‌

సిరిసిల్ల టౌన్‌, మార్చి 17: ప్రజలు పన్నులు సకా లంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నా రు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వంద శాతం ఇంటి పన్నులు వసూలైన 1, 14, 20, 32 వార్డుల కౌన్సిలర్లు పోచవేణి సత్యఎల్లయ్య అడ్డగట్ల మాధవిమురళి, ఆడెపు సౌజన్నమహేందర్‌, సయ్యద్‌ సిమాబేగం అక్రం, బిల్‌ కలెక్టర్లు, వార్డు ఆఫీసరులను చైర్‌ పర్సన్‌ సన్మానించారు. ఈ సందర్భంగా చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల కంటె ముందుగా వంద శాతం ఇంటి పన్నులను చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలి పారు. మిగితా వార్డు ప్రజలు కూడా ఇంటి పన్ను లను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, టీపీవో అన్సారి, మేనేజర్‌, అధికారులు, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T01:08:54+05:30 IST