ఆలోచనలు అదిరేలా..
ABN , First Publish Date - 2023-02-21T00:57:35+05:30 IST
పాఠశాల దశలోనే శాస్త్రవేత్త లుగా ఎదగాలనుకునే విద్యార్థులను ప్రోత్సహించే చక్కటి అవకాశం మ రోమారు లభించింది.
బాల శాస్త్రవేత్తలుగా రాణించే అవకాశం
జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో 78 ప్రదర్శనల ఎంపిక
జగిత్యాల, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): పాఠశాల దశలోనే శాస్త్రవేత్త లుగా ఎదగాలనుకునే విద్యార్థులను ప్రోత్సహించే చక్కటి అవకాశం మ రోమారు లభించింది. ప్రస్తుత 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధిం చిన ఇన్‌స్పైర్ మనక్ అవార్డుల మంజూరు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిం ది. జిల్లా వ్యాప్తంగా అవార్డులకు విద్యార్థుల ఎంపిక పూర్తి చేశారు. ఎంపికైన విద్యార్థులకు వారి ఖాతాల్లో కొంత నగదును ప్రభుత్వం జమ చేయనుంది. సంబంధిత విద్యార్థులు సృజన్మాతక, వినూత్న ఆలోచనలతో తాము నమోదు చేసిన ప్రాజెక్టులను గైడ్ టీచర్ల సలహాలతో సిద్ధం చేయడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాల్సి ఉంటుంది.
లక్ష్యం ఇదే..
పాఠశాలల్లో ప్రవేశం పొందిన 10 నుంచి 15 సంవత్సరాల లోపు వి ద్యార్థుల్లో వినూత్న, సృజనాత్మక, శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించేం దుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్‌టీ), గుజరాత్‌లోని నేషనల్ ఇ న్నోవేషన్ ఫౌండేషన్ (నిప్) సంయుక్తంగా ఈ పథకాన్ని దశాబ్ధ కాలా ని కి పైగా అమలు చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం సుమారు పది లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుం చి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇన్‌స్పైర్ అవార్డులకు అర్హు లుగా నిర్ణయించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థు ల ఉత్తమ ఆలోచనలను పంపించే అవకాశాలుంటాయి.
ఇన్‌స్పైర్ పథకం అమలు ఇలా..
ప్రతీ పాఠశాల నుంచి ఐదు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఎంపి కైన ప్రాజెక్టుల తయారీకి రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ ప్రాజెక్టు ప్రదర్శన పోటీలు నిర్వహి స్తారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన ప్రదర్శనలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనకు ఎంపికైన విద్యార్థుల ఖాతా ల్లో రూ. 20 వేలు జమ చేస్తారు. అత్యుత్తమ ఆలోచనలతో ప్రాజెక్టును రూపొందిస్తే జాతీయ స్థాయి పోటీ వరకు చేరుకునే అవకాశం ఉంటుం ది. జాతీయ స్థాయిలో 60 అత్యుత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్రపతి భవన్‌లో వాటి ప్రదర్శనను నిర్వహిస్తారు. జపాన్‌లో నిర్వహించే విజ్ఞాన యాత్రకు సదరు విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. జిల్లాలోని విద్యా ర్థులు కొన్నేళ్లుగా ఇన్‌స్పైర్ పథకానికి ఎంపికవుతూ పోటీల్లో తమ ప్రతి భను చాటుతున్నారు.
ప్రదర్శనల ఎంపిక పూర్తి..
2022-23 విద్యాసంవత్సరానికి గానూ ఇన్‌స్పైర్ ఘనక్ అవార్డుల ప్రక్రి యలో భాగస్వామ్యం కావడానికి జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయ తీల్లో గల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 615 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలతో దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఉత్తమంగా ఉన్న 78 ప్రదర్శనలను అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలోని జగిత్యాల అర్బన్ మండలం, జగిత్యాల రూరల్ మండలాల్లో 38, కోరుట్ల 5, రాయికల్ 2, మెట్‌పల్లి 5, మేడిపల్లి 4, మల్యాల ఒకటి, ధర్మపురి 3, గొల్లపల్లి 11, ఇబ్ర హీంపట్నం 2, కొడిమ్యాల 2, వెల్గటూరు 3, బీర్‌పూర్ ఒకటి, పెగడపల్లి మండలంలో ఒకటి చొప్పున దరఖాస్తులు ఇన్‌స్పైర్ ప్రదర్శనకు ఎంపిక య్యాయి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల ఆలోచనలను పరిశోధన, వైజ్ఞానిక రంగాల వైపు మళ్లించడానికి నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్ మనక్ అవార్డులో ప్రతిభ కనబరచడానికి పలువురు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు.
ప్రాజెక్టులు సిద్ధం చేయాలి
బాజోజి శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి
జిల్లాలో ఇన్‌స్పైర్ అవార్డులకు నమోదు చేసుకున్న వాటిలో తాజాగా కొన్ని ఉత్తమమైన ఆలోచనలను ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. వాటి ని ఆయా పాఠశాలల వారికి పంపించాము. త్వరలో వీరికి నగదు జమ అవుతుంది. విద్యార్థుల ఆలోచనలకు సృజనాత్మక రూపం ఇచ్చేలా ప్రా జెక్టులను సిద్ధం చేయాలి. ఇందుకు గైడ్ టీచర్, విద్యార్థులు సన్నద్ధం కావాలి.
విద్యార్థులు ప్రతిభ చాటాలి
- జగన్మోహన్ రెడ్డి, జిల్లా విద్యాధికారి
ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లా నుంచి దాదాపు ఆరు వందలకు పైగా ప్రాజెక్టు నమూనాలను ఇన్‌స్పైర్‌కి నమోదు చేస్తే ఇందులో 78 ప్రా జెక్టులు ఎంపికయ్యాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చే సుకోవాలి. ఇందుకు గైడ్ టీచర్లు మరింతగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్పైర్ ప్రదర్శనల పోటీలను ఎప్పుడు నిర్వహించినా తమ ఆలోచనలకు తగ్గట్టుగా ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించాలి.