బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదు
ABN , First Publish Date - 2023-09-20T00:25:05+05:30 IST
తెలంగాణలో గత తొమ్మిదేళ్ల నుంచి పేదలకు ఒరిగిందేమీ లేకపోగా బీఆర్‌ఎస్ నాయ కులు ప్రజాప్రతినిదులు మాత్రం కోట్లా ది రూపాయల అవినీతి సొమ్మును మూటకట్టుకున్నారని టీపీసీసీ ఉపాధ్య క్షులు, మాజీ ఎమ్మెల్యే విజయరమణా రావు అన్నారు.

సుల్తానాబాద్ సెప్టెంబర్ 19: తెలంగాణలో గత తొమ్మిదేళ్ల నుంచి పేదలకు ఒరిగిందేమీ లేకపోగా బీఆర్‌ఎస్ నాయ కులు ప్రజాప్రతినిదులు మాత్రం కోట్లా ది రూపాయల అవినీతి సొమ్మును మూటకట్టుకున్నారని టీపీసీసీ ఉపాధ్య క్షులు, మాజీ ఎమ్మెల్యే విజయరమణా రావు అన్నారు. సుల్తానాబాద్ మండలం లోని కాట్నపల్లిలో సోమవారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పాదయాత్ర నిర్వహించారు. ఏఐసీసీ పరిశీలకుడు, తమిళనాడు రాష్ట్ర ఎమ్మెల్యే రూబీ మనోహరణ్‌తోపాటు నియోజకవర్గ కోఆర్గినేటర్ మల్లేశంగౌడ్, భీమాగాని సౌజన్యగౌడ్, మాజీ ఎ మ్మెల్యే బిరుదు రాజమల్లు, పెద్దపల్లి మాజీ ము న్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య, జడ్పీటీసీ మినుపా ల స్వరూపప్రకాష్‌రావు తదితరులు ఇంటింటికీ తిరుగుతూ సోనియా గాంధీ తుక్కుగూడ సభలో ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సం దర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఏఐసీసీ పరిశీల కుడు రూబీ మనోహరణ్ మాట్లాడారు. ఈ కార్య క్రమంలో ఆనందరావు, చీటి సతీష్, కల్వల శ్రీని వాస్, మండల పట్టణ శాఖ అధ్యక్షులు అక్బర్, వేగోలం అబ్బయ్యగౌడ్, చిలుక సతీష్, దామోదర్ రావు, నోముల శ్రీనివాస్‌రెడ్డి, భూతగడ్డ సంపత్, జగదీష్, అరె సంతోష్, మస్రత్, సంపత్‌రావు, తూముల సుభాష్, రాజయ్య, సంపత్‌రెడ్డి, శేఖర్, సుధాకర్‌రెడ్డి, బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.