సబ్బండ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం
ABN , First Publish Date - 2023-03-19T00:18:50+05:30 IST
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకత పాలన అందిస్తుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెగడపల్లి, మార్చి 18 : రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకత పాలన అందిస్తుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి మం త్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై, చైర్మన్ లోక నిర్మల మల్లా రెడ్డి, వైస్ చైర్మన్ రాజు ఆంజనేయులు, పాలకవర్గ సభ్యులను పూలమాల లు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హాజరైన రై తులు, మండల ప్రజలనుద్దేశించి మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ వ్యవ సా య రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ప్రాజెక్టుల నిర్మాణం, నిరంతర వి ద్యుత్ సరఫరాతో పాటు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏడాదికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. రైతు బీమాతో పాటు మద్దతు ధ రతో పంటల కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల హయాం లో లాగా కాకుండా మార్కెట్ కమిటీలకు సైతం రిజర్వేషన్ సౌకర్యం ప్ర వేశపెట్టి పారదర్శకత పాలన అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ర్పాటుకు ముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములే ఉండగా ఎనిమిదేండ్ల తెలంగాణ రాష్ట్ర పాలనలో కేసీఆర్ నేతృత్వంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి సరిపడే గోదాముల నిర్మాణం చేసిన ట్లు తెలిపారు. వ్యవసాయ రంగంతో పాటు విద్య, వైద్యం, రవాణా, పరి శ్రమల స్థాపన తదితర అన్ని రంగాలలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీ ర్చిదిద్దుతున్నట్లు మంత్రి ఈశ్వర్ ఈ సందర్భంగా తెలిపారు. అంతకు ముందు మండల కేంద్రంలో రెడ్డి సంఘం కళ్యాణమండపం నిర్మాణ పను లను ప్రారంబించడంతో పాటు మండల కేంద్రానికి చెందిన ఒరుగల రాజే శం అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ తోట పెంపకానికి గాను మొక్కలు నాటారు. అనంతరం నందగిరిలో సహకార సంఘం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేసి శంఖుస్థాపన చేశారు. రెండు పడక గదులను ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు. అయిత్‌పల్లిలో ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. కార్యక్రమాలలో డీసీ ఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రా వు, ఎంపీపీ గోళి శోభాసురెందర్ రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు రమణారావు, భాస్కర్ రెడ్డి, వేణుగోపాల్, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, ఆర్బీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ లోక నిర్మల మల్లారెడ్డి, వైస్ చైర్మన్ రాజు ఆంజనేయులు, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ బొమ్మెన జమున స్వా మి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజేశ్వర్‌రావు, మార్కెటింగ్ డీఎం ప్రకాశ్, నందగిరి అయిత్‌పల్లి పాల్గొన్నారు.