కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-09-22T23:56:08+05:30 IST

తమ సమస్యలు పరిష్కరించాల ని డిమాండ్‌ చేస్తూ ఆర్జీ-2 ఏరియా కాంట్రాక్టు కార్మి కులు ఏఐటీయూసీ ఆధ్వ ర్యంలో శుక్రవారం జీఎం ఆఫీస్‌ ఎదుట ధర్నా చేశారు.

కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

యైుటింక్లయిన్‌కాలనీ, సెప్టెంబరు 22: తమ సమస్యలు పరిష్కరించాల ని డిమాండ్‌ చేస్తూ ఆర్జీ-2 ఏరియా కాంట్రాక్టు కార్మి కులు ఏఐటీయూసీ ఆధ్వ ర్యంలో శుక్రవారం జీఎం ఆఫీస్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు వర్కర్స్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బుర్ర తిరుపతి మాట్లాడారు. కాం ట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, జీఓ నంబర్‌ 22 ప్రకారం వేతనాలు లేదా 9వ వేజ్‌బోర్డులో హైపవర్‌ కమిటీ సిఫార్సు చేసిన వేతనాలు అయినా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత, చట్టబద్ధ హక్కులు కల్పించాలని అన్నారు. సింగరేణి లాభాల్లో 20 శాతం వాటా చెల్లించాలని, ప్రమాదవశాత్తు మరణించే కాంట్రాక్టు కార్మికులకు 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఖాళీ క్వార్టర్‌లను కేటా యించాలని తిరుపతి డిమాండ్‌ చేశారు. గత ఏడాది 18 రోజుల సమ్మె సందర్భంగా కార్మిక శాఖ సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం 18 డిమాండ్లు అమలు చేయాలని తిరుపతి డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో ప్రకాష్‌, రాజారత్నం, సురేష్‌, అన్నారావు, శ్యాంసన్‌, సాంబశివరావు, శంక ర్‌, రాజేష్‌తోపాటు కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:56:08+05:30 IST