‘చూపు’ మందగిస్తోంది

ABN , First Publish Date - 2023-03-02T01:09:34+05:30 IST

జిల్లాలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని వయస్సుల వారికి కంటి జబ్బులు సంక్రమిస్తుండడంతో బాధితుల్లో ఆందోళన మొదలవుతు న్నది. రాష్ట్రవ్యాప్తంగా గతనెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమంతో కంటి జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య బయటపడుతు న్నది.

‘చూపు’ మందగిస్తోంది
కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు(ఫైల్‌)

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని వయస్సుల వారికి కంటి జబ్బులు సంక్రమిస్తుండడంతో బాధితుల్లో ఆందోళన మొదలవుతు న్నది. రాష్ట్రవ్యాప్తంగా గతనెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమంతో కంటి జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య బయటపడుతు న్నది. ఇప్పటివరకు పరీక్షించిన వారిలో 46.14 శాతం మందికి దగ్గరి చూపు, దూరపు చూపు మందగించడంతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతు న్నట్లు గుర్తించారు. సాధారణంగా కంటి జబ్బులు వయసు మీరిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని వయస్సుల వారికి చూపు మందగి స్తున్నది. సరైన ఆహారం తీసుకోని కారణంగానే ప్రజలు కంటి జబ్బుల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని గతనెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్నది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో కూడా నిర్వహిస్తున్నారు.

ఫ జిల్లాలో 34 వైద్య బృందాలు..

జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కంటి పరీక్షలను నిర్వహించేందుకు 34 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రా నికి ఒక బృందాన్ని నియమించారు. ఆ బృందం షెడ్యూల్‌ ప్రకారం ఆరోగ్య కేంద్రం పరిధిలోని డివిజన్లు, వార్డులు, గ్రామాలను కవర్‌ చేయనున్నారు. జిల్లాలోగల 263 గ్రామపంచాయతీలు, 114 మున్సి పల్‌ డివిజన్లు, వార్డుల్లో శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్ర మం వంద రోజుల పాటు జరగనున్నది. ఇప్పటివరకు 71 గ్రామాలు, 46 డివిజన్లు, వార్డుల్లో శిబిరాలను నిర్వహించి 1,43,890 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 66,400 మంది కంటి సమ స్యలతో బాధపడుతున్నారని గుర్తించారు. దగ్గరి చూపు మందగించిన వాళ్లు 23,641 మంది ఉన్నారని గుర్తించారు. 3 ప్లస్‌ దగ్గరి చూపు మందగించిన వారికి అద్దాలను పంపిణీ చేశారు. దూరపు చూపు మందగించిన వారు 19,609 మంది ఉన్నారని గుర్తించి అద్దాల కోసం ఆర్డర్‌ ఇచ్చారు. ఇందులో 2432 అద్దాలు జిల్లాకు రాగా, 2145 అద్దాల ను పంపిణీ చేశారు. 23,150 మంది ఇతరత్రా కంటి సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు. వారందరికీ ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆపరేషన్లు చేసే విషయం పేర్కొనలేదు. కంటి సమస్యలతో బాధ పడుతున్న వారి సంఖ్య 46.14 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ‘కంటి వెలుగు’లాంటి కార్యక్రమం ద్వారా కంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు వెలుగులోకి వస్తుండ డంతో జబ్బులు తీవ్రం కాకుండా ఉండేందుకు దోహదం చేస్తున్నదని అంటున్నారు. కంటి జబ్బులను ముందుగానే పసిగట్టినట్లయితే కంటి చూపు మరింత మందగించకుండా ఉండే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌ చదువు తున్న వారికి ఎక్కువగా దూరపు చూపు మందగిస్తున్నది. వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్న వారికి జబ్బులు వస్తున్నాయి. ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ చూడడం, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ను వాడడం వల్ల, మాన సిక ఒత్తిళ్లకు లోనయ్యే వారి చూపు కూడా మందగిస్తున్నదని వైద్యులు చెబుతున్నారు. అంతేగాకుండా కొందరికి ఒక కన్ను దృష్టిలోపం ఉంటే మరోకన్ను బాగానే ఉన్నట్లయితే దాని గురించి పట్టించు కోవడం లేదు. కంటి సమ స్యలు తలెత్తకుండా ఉం డేందుకు ప్రజలకు అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిరంతరం ఉచితంగానే కంటి పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పండ్లు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి

డాక్టర్‌ సబిహ తబసుమ్‌, కంటి వైద్య నిపుణులు, పెద్దపల్లి

కంటి చూపు మందగించకుండా ఉండేందుకు ఏ విటమిన్‌ గల పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు ఒకటి ఉడక బెట్టిన గుడ్డు గానీ, అమ్లెట్‌ అయినా తినాలి. ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారం, మొలకలు తీసుకోవాలి. కళ్ల సం రక్షణ కోసం అవసరం లేకున్నా కూడా స్మార్ట్‌ఫోన్‌ చూడడం తగ్గించు కోవాలి. టీవిని దూరంగా ఉండి చూడాలి. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ను వినియోగించే వాళ్లు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గ్యాప్‌ ఇవ్వాలి. ఎండాకాలంలో ఎక్కువ సేపు ఎండలో ఉండకూడదు. అవసరమైతే సన్‌గ్లాసెస్‌ వాడాలి. వెల్డింగ్‌ పనులు చేసే వాళ్లు తప్పనిసరిగా గ్లాసెస్‌ వాడాలి. షుగర్‌, బీపీ జబ్బులతో బాధపడుతున్న వాళ్లు ఎప్పటికప్పు డు కంటి పరీక్షలు చేయించుకోవాలి. మయోపియా (దూరపు చూపు తగ్గడం) ఉన్న వాళ్ల పిల్లలకు కూడా వచ్చే అవకాశాలున్నందున వారికి పరీక్షలు చేయించాలి.

Updated Date - 2023-03-02T01:09:34+05:30 IST