క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ABN , First Publish Date - 2023-04-03T00:19:30+05:30 IST
క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, మైదానాలను అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ రమణ
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 2: క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, మైదానాలను అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక ఎస్‌కేఎన్‌ఆర్ ప్ర భుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ పీజీ కళాశాలలో యువత, ఎన్‌సీసీ కేడెట్ల శిక్షణ కోర్సులో భాగంగా రూ.7.60లక్షలతో గ్రౌండ్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్‌సీసీ ద్వారా విద్యా ర్థులకు సేవా ధృక్పతం, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఈ కళాశాల పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి కళాశాల అభివృద్ధికి తమవంతు తో డ్పాటును అందించాలన్నారు. బాస్కెట్ బాల్ కోర్టుకోసం రూ.5లక్షల ని ఽధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించేందుకు శిక్షణార్ధుల సౌకర్యార్థం రూ.33లక్షలతో రన్నింగ్ ట్రాక్ ని ర్మాణం ఇక్కడే ఏర్పాటు చేశామని, ఆదిలాబాద్, నిర్మల్ నుంచి సైతం ని రుద్యోగులు రన్నింగ్ ట్రాక్‌లో శిక్షణ నిమిత్తం రావడం జిల్లాకు గర్వకార ణం అన్నారు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటు నిర్ణయం గొప్పదని, పట్టణం లో ఇప్పటికే 15 క్రీడా మైదానాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల మానసికోల్లాసం, శారీరక ధృడత్వానికి క్రీడలు అవసరమని, విద్యతో పా టు, విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. ప్రజలు సైతం ఆరోగ్య పరిర క్షణకు నిత్యం వ్యాయామం, వాకింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్‌లు తోట మల్లికార్జున్, కూ తురు రాజేష్, కమిషనర్ భోనగిరి నరేష్, కళాశాల ప్రిన్సిపాల్ అశోక్, పీడీ రవీంధర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ బాధ్యులు నర్సయ్య, నాయకులు పాల్గొన్నారు.
వాస్తవాలు మాట్లాడితే ఓట్లు పోతాయ్
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వ్యాఖ్యలు
ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవాలు మాట్లాడితే సుమారు 300 నుంచి 500 ఓట్లు పోతాయని ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేం ద్రంలోని స్థానిక ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో పలు అభివృ ద్ధి పనులకు భూమిపూజ చేసిన ఆయన తమ సందేశంలో భాగంగా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీ యాల్లోకి వచ్చాం, ఓట్ల బిచ్చగాళ్లమయ్యామని ఒక్కో ఓటు ఎలా కాపా డుకోవాలనేది ప్రధానం అన్నారు. ఒక్క ఓటు కూడా దూరం చేసుకో వ ద్దనే ఉద్దేశ్యంతోనే తాను మౌనంగా ఉంటున్నట్లు పరోక్షంగా స్పష్టం చే శారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.