రైతుల మనోవేదనను పట్టించుకోని ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-05-26T00:13:49+05:30 IST

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడంలో జ రుగుతున్న జాప్యం కారణంగా రైతాంగం తీవ్ర మనోవేదనకు గురవుతుంటే ప్ర భుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని రాజన్నసిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షు డు ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు.

రైతుల మనోవేదనను పట్టించుకోని ప్రభుత్వం
భూషణరావుపేటలో రైతును ఓదార్చుతున్న ఆది శ్రీనివాస్‌

ఫ రాజన్నసిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌, మే 25 : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడంలో జ రుగుతున్న జాప్యం కారణంగా రైతాంగం తీవ్ర మనోవేదనకు గురవుతుంటే ప్ర భుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని రాజన్నసిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షు డు ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు. రెండు రోజుల కిందట మండలంలోని భూష ణరావుపేటకు చెందిన రైతు గోపిడి మధురెడ్డి కొనుగోలు కేంద్రం వద్ద ఆత్మహ త్యాయత్నానికి పాల్పడగా గురువారం ఆ కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోళ్ల విష యంలో ప్రణాళికాబద్ధంగా లేకపోవడం వల్లే రైతులకు తీరని కష్టాలు ఎదురవు తున్నాయన్నారు. మానసికంగా ఇబ్బందులు పడుతున్న రైతుకు దైర్యం చెప్పాల్సి న అధికార బీఆర్‌ఎస్‌ నేతలు అకారణంగా దాడులకు పాల్పడడం దురదృష్టక ర మన్నారు. లారీల కొరతను అధిగమించే ఆలోచన చేసి తూకం వేసిన ధాన్యంను రైసుమిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైం ద న్నారు. ఇప్పటికే బస్తాకు రెండు కిలోల చొప్పన కటింగ్‌ చేస్తూ రైతులను దోచు కుంటున్నా సర్కారు మొద్దు నిద్దపోతుండడం శోచనీయమన్నారు. యుద్ధప్రాతి పదికన కొనుగోళ్లు జరిపి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అ జీం, పీసీసీ కార్యవర్గ సభ్యుడు తొట్ల అంజయ్య, గడ్డం స్వామిరెడ్డి, పూండ్ర ప్ర తా ప్‌రెడ్డి, చిన్నారెడ్డి, వెగ్యారపు శ్రీహరి, సత్యనారాయణ, ముదాం శేఖర్‌, శంకర్‌ ఉన్నారు.

Updated Date - 2023-05-26T00:13:49+05:30 IST