Share News

జిల్లా అభివృద్ధి ఆగదు

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:24 AM

రాజన్న సిరిసిల్ల అభివృద్ధి ఆగదని, ప్రజలు ఆందో ళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్‌, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు. ప్రభుత్వ విప్‌గా బాధ్య తలను స్వీకరించిన అనంతరం ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆది శ్రీనివాస్‌కు సిరిసిల్ల కాంగ్రెస్‌ నాయకులు గజమాలతో పట్టణ శివారులో స్వాగతం పలికారు.

జిల్లా అభివృద్ధి ఆగదు

సిరిసిల్ల టౌన్‌, డిసెంబర్‌ 17 : రాజన్న సిరిసిల్ల అభివృద్ధి ఆగదని, ప్రజలు ఆందో ళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్‌, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు. ప్రభుత్వ విప్‌గా బాధ్య తలను స్వీకరించిన అనంతరం ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆది శ్రీనివాస్‌కు సిరిసిల్ల కాంగ్రెస్‌ నాయకులు గజమాలతో పట్టణ శివారులో స్వాగతం పలికారు. ముందుగా విద్యానగర్‌ బైపాస్‌ రోడ్డు పక్కను ఉన్న రేణుక ఎల్లమ్మ దేవాల యంలో అమ్మవారిని ఆది శ్రీనివాస్‌ దర్శిం చుకున్నారు. ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి పట్టణ ప్రధాన రహదారుల గుండా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల బైక్‌ ర్యాలీలో పాల్గొ న్నారు. పట్టణంలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, నేతన్న విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సంద ర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ ఇచ్చారని, రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం కొలువుదీరిందని అన్నారు. జిల్లాలో అభివృద్ధి కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. శాసన సభలో ప్రతి పక్షంలో కూర్చున్న వారు ఇంకా అధికారంలో ఉన్నా రనే భ్రమలో ఉన్నారని, అలాంటి వారి మాటలను విశ్వసించ వద్దని అన్నారు. చొప్పదండి, మాను కొండూరు, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామ న్నారు. స్థానికుడిగా పల్లెల అభివృద్ధికి ఇచ్చిన హామీలను గుర్తుపెట్టుకొని హామీలను, సమస్యలను పరిష్కరించి ప్రజల మనస్సు గెలుచుకుంటామ న్నారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షంలో కూర్చున్న నాయకులు అధికార పార్టీ పక్ష నాయకులుగా మాట్లాడిన తీరును ప్రజలు గమనించారన్నారు. గవర్నర్‌ ప్రసంగం, తీర్మానంపై మాట్లాడ మంటే రాజకీయాలు మాట్లాడారన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయనున్నట్లు చెప్పారన్నారు. ప్రతిపక్షం ఇప్పుడే ఉలిక్కిపడాల్సిన అవసరం లేదని, 100 రోజుల్లో తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అన్నారు. ప్రగతి భవనం కంచెలను తీసి వేసి ప్రజాదర్బార్‌గా చేసిన తరువాత బీఆర్‌ఎస్‌కు మనసున పట్టడం లేదన్నారు. నేడు ప్రజలు ప్రగతి భవన్‌కు వెళ్తున్నారని, ప్రజాదర్బార్‌లో సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారని అన్నా రు. రాష్ట్రంలో ఓట్లు వేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకరించిన వారందరికి పేరు పేరున ధన్యావాదాలు తెలిపారు. ప్రభుత్వ విప్‌గా తనకు స్వాగతం తెలిపిన సిరిసిల్ల పట్టణంతోపాటు అన్ని మండలాల కాంగ్రెస్‌ నాయకులు, అను బంధ సంఘాల నాయకులు, మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, టీపీసీసీ సభ్యుడు నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు వంగ మల్లేశంగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన, పట్టణ అధ్యక్షురాలు వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, జడ్పీటీసీ నాగం కుమార్‌, కౌన్సిలర్లు ఆకునూరి విజయనిర్మల, చొప్పదండి లలిత, పట్టణ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, యూత్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్‌, జిల్లా పట్టణ నాయకులు గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్‌, మ్యాన ప్రసాద్‌, కే చక్రధర్‌రెడ్డి, గోలి వెంకటరమణ, అహ్మద్‌, ఖాజా, అశోక్‌, వెంకటేశం, శ్రీనివాస్‌, రాజు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:24 AM