నాయీ బ్రాహ్మణుల డిమాండ్లు నెరవేర్చాలి

ABN , First Publish Date - 2023-07-26T00:39:20+05:30 IST

నాయీ బ్రాహ్మణ కుల వృత్తిపై కేవలం నాయీ బ్రాహ్మణులకే హక్కును కల్పించాలని తెలం గాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

నాయీ బ్రాహ్మణుల డిమాండ్లు నెరవేర్చాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న నాయీ బ్రాహ్మణులు

సుభాష్‌నగర్‌, జూలై 25: నాయీ బ్రాహ్మణ కుల వృత్తిపై కేవలం నాయీ బ్రాహ్మణులకే హక్కును కల్పించాలని తెలం గాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుంజపడుగు హరిప్రసాద్‌ మాట్లాడుతూ క్షౌర వృత్తి అనేది వంశపారంపర్యంగా వస్తున్నదని అన్నారు. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు వృత్తిలోకి చొరబడి తమ పొట్ట కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు నాయీ బ్రాహ్మణులు కులవృత్తి చేసుకుంటూ సమాజానికి సేవలంది స్తున్నారని అన్నారు. మనిషి పుట్టుక నుంచి చని పోయేంత వరకు నాయీ బ్రాహ్మణుడు లేనిది ఏ కార్యం జరగదన్నారు. గతంలో నగరాలకే పరిమితమైన కార్పొరేట్‌ సంస్థలు ఇపుడు మండలాలకు విస్తరించి కుల వృత్తిని దోపిడీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. రజక వృత్తిని ఇతరులు నిర్వహించరాదని ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేసిందని, క్షౌరవృత్తిని కూడా ఆ జీవో పరిధిలోకి తీసుకు రావాలన్నారు. కార్పొరేట్‌ సంస్థలను క్షౌర వృత్తిలోకి రాకుండా నియంత్రించి తమ కులవృత్తిని కాపాడి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహద పడాలని ఈసందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షుడు జంపాల నర్సయ్య, సింగిరాల వెంకట స్వామి, గర్శకుర్తి శంకర్‌, శ్రీరాముల బాలసురేందర్‌, జంపాల శంకర్‌, శ్రీరాముల రమేశ్‌, ముత్యాల లక్ష్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-26T00:39:20+05:30 IST