హామీలను గాలికి వదిలేసిన సీఎం

ABN , First Publish Date - 2023-03-18T23:51:29+05:30 IST

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ గాలికి వదిలేసి బంగారు కుటుంబం కోసం పాటు పడుతున్నా రని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డి విమర్శించారు.

హామీలను గాలికి వదిలేసిన సీఎం

పెద్దపల్లిటౌన్‌, మార్చి 18: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ గాలికి వదిలేసి బంగారు కుటుంబం కోసం పాటు పడుతున్నా రని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమస్యలన్ని పరిష్కా రం అవుతాయనుకుంటే సమస్యల వలయంగా మారిందన్నారు. స్థానిక ఎన్‌ఎస్‌ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభు త్వం ఏర్పడి 9 ఏళ్ళు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులు, కొత్త అసరా పింఛన్ల మం జూరు, దరఖాస్తు చేసుకున్న వెంటవెంటనే మంజూరు చేసే ప్రక్రియ ను కొనసాగించాలని సూచించారు. డబుల్‌ బెడ్‌రూం నిర్మించుకుంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూము లను గుర్తించి ఇంటి స్థలం లేని కుటుంబాలకు అందజేయాలన్నారు. కార్పొరేట్‌ వ్యక్తుల 12 లక్షల కోట్ల రూపాయల రుణాలను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్ని ధ్వంసం చేసి కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతోందన్నారు. 9 రాష్ర్టాల్లో గవర్నర్ల చేత వేల కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రశ్నించే ప్రతిపక్షాలు లేకుండా బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. కా ర్పొరెట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలు మార్చుతూ కార్మికుల హ క్కులు కాలరాస్తోందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ హటావో భారత్‌ బచావో అనే నినాదంతో ఏప్రిల్‌ 14 నుంచి మే 14 వరకు దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా పాదయాత్రలు చేయాలని సీపీఐ జాతీయ కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలవేన శంకర్‌, తాండ్ర సదానందం, గోషిక మోహ న్‌, గౌతం గోవర్ధన్‌, కోడేం స్వామి, కడారి సునీల్‌, మానస్‌కుమార్‌, పెర్క సతీష్‌, చంద్రగిరి ఉదయ్‌, బుద్దుల రమేష్‌, మటేటి శంకర్‌, చంద్ర శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:51:29+05:30 IST