జడ్పీటీసీ కుటుంబంపై పెట్టిన కేసులు ఎత్తేయాలి
ABN , First Publish Date - 2023-07-08T00:29:05+05:30 IST
జడ్పీటీసీ కుటుంబంపై అక్రమంగా బనాయించి న కేసులను వెంటనే ఎత్తేయాలని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డి మాండ్ చేశారు.
మెట్‌పల్లి రూరల్, జూన్, 7 : జడ్పీటీసీ కుటుంబంపై అక్రమంగా బనాయించి న కేసులను వెంటనే ఎత్తేయాలని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డి మాండ్ చేశారు. కోరుట్ల నియోజక వర్గంలోని మూసివేసిన ముత్యంపేట షుగ ర్ ఫ్యాక్టరీని తెరిపించడం తెలియదు కానీ కక్ష సాధింపు రాజకీయాలు చేయ డం తెలుసా అని బీఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశించి ఏద్దేవా చేశారు. శుక్రవారం మం డలంలోని రామారావుపల్లి గ్రామంలోని నర్మద కుటుంబం, జడ్పీటీసీ కాటిపల్లి రాధా-శ్రీనువాసు కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం వాసవి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. పార్టీ మారిన, నచ్చని వారిపై కక్ష సాధింపు చర్యల్లో ఎస్సీ ఎస్టీలను ఉసిగొలిపి అక్రమ కేసులు పెట్టించడం సరి యైున పద్ధతి కాదన్నారు. ఇప్పటి వరకు నిరుపేదలకు ఎన్ని డబుల్ బెడ్ రూము లు, మూడు ఎకరాల భూమి ఎక్కడ ఇచ్చావు, మాటచ్చిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును ఉద్దేశించి విమ ర్శించారు. ఎన్నికలు వస్తున్నాయంటే ప్రోసిడింగ్‌లు, బాండ్ పేపరులు రాసి ఇవ్వ డం గెలిచిన తరువాత మెండి చెయి చూపించుకుంటూ చేస్తున్న మోసపూరిత రాజకీయాలను ప్రజలు గుర్తించి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నా రు. నర్మదపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. లేనియేడల పార్టీ వారికి అండగా నిలబడి చర్యలు తీసుకునేంత వరకు వారి వెంట ఉంటుం దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.