Share News

దోపిడీ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:50 PM

కార్మిక, కర్షక శ్రేయస్సు కోసం, సమ సమాజ స్థాపన కోసం, మానవ జీవితంలో అంతరాలు లేని దోపిడీ రహిత సమాజం కోసం సీపీఐ నిరంతరం పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు.

దోపిడీ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జెండాను ఆవిష్కరిస్తున్న జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

- సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

- ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

భగత్‌నగర్‌, డిసెంబరు 26: కార్మిక, కర్షక శ్రేయస్సు కోసం, సమ సమాజ స్థాపన కోసం, మానవ జీవితంలో అంతరాలు లేని దోపిడీ రహిత సమాజం కోసం సీపీఐ నిరంతరం పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. మంగళవారం సీపీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయం బద్ధం ఎల్లారెడ్డి భవన్‌పై సీపీఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబరు 26న కాన్పూర్‌లో సీపీఐ ఆవిర్భవించిందని, నాడు బ్రిటీష్‌ పాలకులు దేశాన్ని పరిపాలిస్తున్న తరుణంలో స్వాతంత్య్రం నా జన్మ హక్కు అని, భారతదేశానికి బ్రిటీష్‌ పాలకుల నుంచి విముక్తి కావాలని దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో సీపీఐ నాయకత్వం ప్రత్యక్షంగా పాల్గొని అనేక మంది జైలు పాలయ్యారన్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో అనేక పోరాటాలు నిర్వహించడంలో సీపీఐ ముందుందని తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సీపీఐ అనేక నిర్బంధాలను ఎదుర్కొందన్నారు. దేశంలో అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని, పని గంటలు తగ్గించాలని, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అనేక కార్మిక, ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించిందని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, నీడ కావాలని నేటికీ పేదల పక్షాన అనేక పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కిన్నెర మల్లవ్వ, పైడిపెల్లి రాజు, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్‌, నలువాల సదానందం, బూడిద సదాశివ, బోనగిరి మహేందర్‌, నాయకులు న్యాలపట్ల రాజు, కొట్టె అంజలి, చెంచల మురళి, తంగెళ్ల సంపత్‌, సాయవేని రాయమల్లు, నునావత్‌ శ్రీనివాస్‌, కొమురయ్య, నల్లగొండ శ్రీనివాస్‌, రమేష్‌, బాల్‌రాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:50 PM