కొండగట్టులో భక్తుల సందడి

ABN , First Publish Date - 2023-06-11T00:12:57+05:30 IST

కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానం శనివారం భక్తులతో సందడిగా మారింది.

కొండగట్టులో భక్తుల సందడి
ఆలయంలోని క్యూలైన్‌లో వస్తున్న భక్తులు

మల్యాల, జూన్‌ 10: కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానం శనివారం భక్తులతో సందడిగా మారింది. వేలాదిగా భక్తులు స్వామి వారి సన్నిధికి చే రుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో భక్తులు స్వామి వారికి అభి షేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. నూతన వాహనాలకు స్వామి వారి సన్ని ధిలో పూజలు చేశారు. రోజంతా కొండపైన భక్తుల రద్దీ కొనసాగింది. భక్తుల కు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

ఫ అక్రమ వసూళ్లపై ఆగ్రహం

ఆలయంలో భక్తులు కొబ్బరికాయ కొట్టె చోట ఒక్కో కొబ్బరికాయకు రూ. 10 అక్రమంగా వసూలు చేయడం పట్ల సర్పంచ్‌ బద్దం తిరుపతిరెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు జున్న సురేందర్‌, కొంక నర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి సిబ్బంది తీరుపై మండిసడుతూ ఏఈవో బుద్ది శ్రీనివాస్‌ దృ ష్టికి తీసుకెళ్లారు. దీంతో వసూలు చేసిన సొమ్ములను ఆలయ అధికారులు హుండీలలో వేయించారు. అనంతరం మైక్‌ ద్వారా డబ్బులు ఇవ్వకూడదని ప్రచారం చేశారు. మళ్లీ అక్రమంగా వసూళ్లు చేస్తే తగు చర్యలు తీసుకోవా లని పాలకమండలి సభ్యులు అధికారులతో పేర్కొన్నారు.

ఫ నేడు జ్యేష్ఠాభిషేకం

ఆంజనేయ స్వామి సన్నిధిలో ఆదివారం జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్న ట్లు ఆలయ ఈవో వెంకటేష్‌ తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్ర మంలో భాగంగా ప్రత్యేక పూజల అనంతరం 108 కళశాలతో స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతందని అన్నారు.

Updated Date - 2023-06-11T00:12:57+05:30 IST