ప్రగతి పథంలో తెలంగాణ

ABN , First Publish Date - 2023-06-03T00:48:18+05:30 IST

‘తెలంగాణ రాష్ట్రం పదేళ్లలోనే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆరితేరింది.. మన అస్థిత్వం కోసం జరిగిన పోరాటం సుదీర్ఘమైనది.. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సబ్బండవర్గాలు, సమస్త రాజకీయ పక్షాలు కలిసి చేసిన ఉద్యమ ఫలితమిది’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

ప్రగతి పథంలో తెలంగాణ
పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘తెలంగాణ రాష్ట్రం పదేళ్లలోనే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆరితేరింది.. మన అస్థిత్వం కోసం జరిగిన పోరాటం సుదీర్ఘమైనది.. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సబ్బండవర్గాలు, సమస్త రాజకీయ పక్షాలు కలిసి చేసిన ఉద్యమ ఫలితమిది’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం పోలీస్‌ పరేండ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించి, పోలీసు రక్షణ దినోత్సవ పోస్టర్‌ ఆవిష్కరించారు. జిల్లాలోని వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను, స్టాళ్లను తిలకించి ప్రతిభ కనబరిచిన వ్యవసాయశాఖకు మొదటి బహుమతి, దళితబంధుకు రెండో బహుమతి, పశుసంవర్థకశాఖకు మూడో బహుమతి, డీఆర్డీవో శాఖకు కన్సోలేషన్‌ బహుమతులను ప్రదానం చేశారు. అంతకు ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్‌ ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సుబ్బారాయుడు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, నగర మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, ట్రైనీ కలెక్టర్లు నవీన్‌ నికోలస్‌, లెనిన్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:48:18+05:30 IST