దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణ

ABN , First Publish Date - 2023-06-03T00:57:40+05:30 IST

ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో దేశా నికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం పురస్క రించుకొని శుక్రవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో జాతీయ జెం డాను ఆవిష్కరించారు.

దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణ
జెండా వందనం చేస్తున్న మంత్రి

జగిత్యాల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో దేశా నికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం పురస్క రించుకొని శుక్రవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో జాతీయ జెం డాను ఆవిష్కరించారు. ముందుగా అమర వీరుల స్థూపం వద్ద పూలు చల్లి నివాళులు అర్పించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీ య జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపాలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. స్వల్ప కాలంలో తెలంగాణ అత్యంత ప్రగతి శీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. జి ల్లాలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా గణనీయమైన ప్రగతిని సా ధించామని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సమ గ్రాభివృద్ధిని సాధిస్తున్నామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో వ్య వసాయం పండుగలా మారిందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధియే, ఇతర రం గాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుందన్నారు. రైతు బంధు పథకం ద్వారా జిల్లాలో సుమారు 2.17 లక్షల మంది రైతులకు రూ. 1,868 కోట్లు పంట పెట్టుబడిగా అందించామన్నారు. జిల్లాలో 664 మంది రైతులకు 729 హెక్టార్లలో ఆయిల్‌ ఫామ్‌ పంట సాగు కోసం రాయితీని అందిం చామని తెలిపారు. రూ. 31 కోట్లతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 14 ఆ ధునిక గోదాములు నిర్మించామని వెల్లడించారు. రైతు వేదికలను నిర్మించి సాగు మెలుకువలు, వ్యవసాయ నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తున్నా మని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రూ. 605 కోట్లు వెచ్చించి వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు ఉచితంగా సరాఫరా చేస్తున్నామన్నారు. రోళ్లవాగు ప్రా జెక్టు నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయని తెలి పారు. మిషన్‌ కాకతీయ కింద నాలుగు దశల్లో ఇప్పటివరకు రూ. 67.30 కోట్ల నిధులతో 263 చెరువుల పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిషన్‌ భగీరథ కింద రూ. 1,430 కోట్ల నిధులతో సురక్షిత తాగునీరు సరాఫరా అవుతుందని తె లిపారు. జిల్లాలో 8,772 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు అయ్యా యని, వీటిలో 4,715 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. జిల్లా కేం ద్రంలో వంద పడకల నూతన మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. జగిత్యాలకు మెడికల్‌ కళాశాల మంజూరు చేసి విజయవం తం నడిపిస్తున్నామన్నారు. రూ. 510 కోట్ల నిధులతో నూతన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా రూ. 68.80 కోట్ల నిధు లతో సింగిల్‌ రోడ్లను డబుల్‌ రోడ్లు గా అభివృద్ధి పరిచామని, రూ. 152 కోట్లతో 28 హైలెవల్‌ వంతెన నిర్మాణాలు జరిపామన్నారు. జిల్లాలో దళిత బంధు పథకం కింద 345 మంది లబ్ధిదారుల యూనిట్లను గ్రౌండింగ్‌ పూర్తి చేశా మని తెలిపారు. సాంఘిక సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, వెనకబడిన తర గతుల అబివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పలు సంక్షేమ కార్య క్రమాలను చురుకుగా నిర్వహిస్తున్నా మన్నారు. జిల్లాలో 15 మంది గిరిజన లబ్ధిదారులకు పోడు పట్టాల పంపిణీని త్వరలో చేపట్టనున్నామని వెల్లడించారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద రూ. 116.33 కోట్ల నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని తె లిపారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా జోరుగా అభి వృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌, జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, మంద మక రందు, ఆర్డీవో మాదురి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ గొల్లపల్లి చంద్ర శేఖర్‌గౌడ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు చీటి వెంకట్రావు, ఇన్‌చార్జీ మున్సిపల్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

వాడ వాడన రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శుక్రవారం జగిత్యాలలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని వాడ వాడన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, రాజకీయ పక్షాల కార్యాల యాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం, జాతీయ గీతాలాపాన, జెండా వందనం తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. క లెక్టరు క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా జెండా వి ష్కరణ చేశారు. అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, మంద మకరందు తదిత రులతో కలిసి జెండావందనం చేశారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాల యంలో జాతీయ పతాకాన్ని ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌ ఆవిష్కరించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌, ము న్సి పల్‌ కార్యాలయంలో ఇన్‌చార్జీ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, రెవెన్యూ డివిజన్‌ కా ర్యాలయంలో ఆర్డీవో మాదురి, బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో పార్టీ జి ల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు జెండా విష్కరణ చేసి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ తదితరులతో కలిసి జెండావందనం, జాతీయ గీతాలాపాన జరి పారు. కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి జెండ ావిష్కరణ చేయడం, స్వతంత్ర సమరయోదుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిపారు.

జగిత్యాల అర్బన్‌: పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర ఆవిర్భావ వే డుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. పట్టణంలోని గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ గొల్లపల్లి చంద్రశేఖర్‌ గౌడ్‌, బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రవీణ్‌, జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ, తహసీల్‌ చౌరస్తా వద్ద భారత సురక్ష సమితి నేతలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. బీజేపీ జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అమర వీరులకు భారత సురక్ష సమితి నాయకులు అక్కినపల్లి కాశీనాథం, ఏసీఎస్‌ రాజు, సింగం గంగాధర్‌, వేముల పోచమల్లు నివా ళులు అర్పించారు. టవర్‌ సర్కిల్‌ వద్ద, తెలుగు దేశం పార్టీ జిల్లా కార్యా లయంలో జిల్లా టీడీపీ నాయకులు మహంకాలి రాజన్న జెండా ఎగు రవేసి నాయకులు మగ్గిడి గంగాధర్‌తో కలిసి జాతీయ జెండాకు వందన సమర్పణ నిర్వహించారు.

Updated Date - 2023-06-03T00:57:40+05:30 IST