అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ముందంజ

ABN , First Publish Date - 2023-09-18T00:47:25+05:30 IST

అభివృద్ధి, సం క్షేమంలో తెలంగాణ ముందంజలో ఉందనిరాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదివారం ఆవిష్కరించారు.

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ముందంజ
జాతీయజెండాకు వందనం చేస్తున్న మంత్రి కొప్పుల, కలెక్టర్‌, ఎమ్మెల్యే సంజయ్‌,

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం

జగిత్యాల, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సం క్షేమంలో తెలంగాణ ముందంజలో ఉందనిరాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందన సమర్పణ చేశారు. మంత్రి ఈశ్వర్‌కు పోలీసులు గౌరవ వందన సమర్పణ చేశారు. పలువురు స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకు ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు. ఈ సందర్బంగా మంత్రి ఈశ్వర్‌ మాట్లాడారు. సమైక్యతను చాటే విదంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకావిష్కరణ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ సమైక్య తా దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక సంఘటన ఆధారంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. కాగా స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్ల ను మంత్రి ఈశ్వర్‌ ఆవిష్కరించారు. కలెక్టరేట్‌ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ చిత్రపటానికి పూలమా ల వేసి ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛత పురస్కారాలను అందుకున్న పలువురు పంచాయతీ సర్పంచ్‌లను పూలమాలలు, శాలువలు, జ్ఞాపికలను అందించి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సత్కరిం చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజ య్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌, అదన పు కలెక్టర్లు బీఎస్‌ లత, దివాకర, డీఎస్‌పీ వెంకటస్వామి, మున్సిపల్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

- పట్టణంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌ జాతీయ జెండాను ఆవిష్క రించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేశ్‌, పీఆర్‌ ఈఈ రహమన్‌, డీఈ మిలింద్‌, జడ్పీ సిబ్బంది పాల్గొన్నారు.

జగిత్యాల టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు, పోలీ స్‌ ప్రధాన కార్యాలయాల్లో ఎస్పీ భాస్కర్‌ హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీలు రవీంద్రరెడ్డి, వెంకటస్వామి ఉన్నారు.

Updated Date - 2023-09-18T00:47:25+05:30 IST