ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధనలు చేయాలి
ABN , First Publish Date - 2023-08-22T01:05:10+05:30 IST
ఉన్నత పాఠశాలలో ఉన్నతి అభ్యసన అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా బోధనలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి అన్నారు. గర్రెపల్లి మోడల్‌స్కూల్‌లో జిల్లాలోని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు అందరికీ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి సోమవారం ప్రారంభించారు
- జిల్లా విద్యా అధికారి మాధవి
సుల్తానాబాద్, ఆగస్టు 21: ఉన్నత పాఠశాలలో ఉన్నతి అభ్యసన అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా బోధనలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి అన్నారు. గర్రెపల్లి మోడల్‌స్కూల్‌లో జిల్లాలోని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు అందరికీ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి సోమవారం ప్రారంభించారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సామర్ధ్యాలు, లర్నింగ్ అవుట్ కమ్స్ సాధించడానికి ఉన్నతి అభ్యసన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అందరూ ఉన్నతి లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలని కోరా రు. 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం లక్ష్య అనే కార్యక్రమా న్ని నిర్వహిస్తోందని, ఇందులో ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలో మూడు రోజుల కార్యక్రమంలో తెలియజేస్తారన్నారు. కార్యక్రమం పర్యవేక్షణ అధికారిగా సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ డాక్టర్ పీఎం షేక్, కోర్సు డైరెక్టర్‌గా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ విజయ్ కుమార్, సెం టర్ ఇన్‌చార్జి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రఘునాథ్, రిసోర్స్ పర్సన్ లుగా సుదర్శన్, ఆగయ్య, రమేష్, సంపత్‌రావు వ్యవహరిం చారు. శిక్ష ణ కార్యక్రమంలో 105 మంది ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.