ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-01-18T00:11:40+05:30 IST

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవా లని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన నాయకుడు డాక్టర్‌ సంజయ్‌ అన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కల్యాణ లక్ష్మి చెక్కను అందిస్తున్న డాక్టర్‌ సంజయ్‌

కోరుట్ల, జనవరి 17 : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవా లని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన నాయకుడు డాక్టర్‌ సంజయ్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ. 15 ల క్షల విలువగల చెక్కులను లభ్దిదారులకు స్థానిక నేతలతో కలిసి డా. సం జయ్‌ పంపిణీ చేశారు. అదే విధంగా పట్టణానికి చెందిన నిరుపేద కు టుంబానికి ఆసుపత్రి ఖర్చుల కింద రూ. 1,25 లక్షల విలువగల ఎల్‌ వో సీని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సంజయ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వార రాష్ట్ర ముఖ్యమంత్రి ప థకాలను రూపొందించి అందిస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం పీపీ తోట నారాయణ, వైస్‌ చైర్మన్‌ గడ్డమీది పవన్‌, పట్టణ అధ్యక్షుడు అ న్నం అనిల్‌, కౌన్సిలర్లు జిందం లక్ష్మినారాయణ, ఎంబేరీ నాగభూషణం నాయకులు పోగుల లక్ష్మిరాజం, పుప్పాల ప్రభాకర్‌, రియాజ్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

మల్లాపూర్‌ : మల్లాపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు నాయకలు పంపిణీ చేశారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 38లబ్ధిదారులకు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, ఎంపీపీ కాటిపల్లి సరోజన-ఆదిరెడ్డిలు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:11:51+05:30 IST