స్వీపర్లను రెగ్యులరైజ్‌ చేయాలి

ABN , First Publish Date - 2023-07-18T00:06:07+05:30 IST

జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల స్వీపర్లను రెగ్యులరైజ్‌ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్‌ డిమాండ్‌ చేశారు. తమను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర జిల్లా, మండల పరిషత్‌ స్కూల్స్‌ స్వీపర్ల సంఘం ఆధ్వర్యంలో పాఠశాలల స్వీపర్లు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరింది.

స్వీపర్లను రెగ్యులరైజ్‌ చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్ష చేస్తున్న స్వీపర్లు

సుభాష్‌నగర్‌, జూలై 17: జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల స్వీపర్లను రెగ్యులరైజ్‌ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్‌ డిమాండ్‌ చేశారు. తమను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర జిల్లా, మండల పరిషత్‌ స్కూల్స్‌ స్వీపర్ల సంఘం ఆధ్వర్యంలో పాఠశాలల స్వీపర్లు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరింది. సోమవారం స్వీపర్లు మోకాళ్ళపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లను రెగ్యులరైజ్‌ చేయాలని ఏవీఎస్‌ రెడ్డి కమిటీ సిఫార్సు చేసిందన్నారు. ప్రభుత్వం ఆ సిఫార్సులను పట్టించుకోకుండా పీఎఫ్‌, ఈఎస్‌ఐ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, ప్రమోషన్లు కల్పించలేదన్నారు. తెలంగాణ ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని వారు ఆశపడితే నిరాశే మిగిలిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్వీపర్లు రెగ్యులర్‌ పేతో 19 వేల రూపాయల జీతం పొందుతున్నారని తెలిపారు. స్వీపర్లను వెంటనే రెగ్యులరైజ్‌ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి పాండ్రాల రమేశ్‌, నాయకులు ఎస్‌డీ సలీం, బండారి శంకరయ్య, మొండయ్య, భూమయ్య, కనకవ్వ, రాజమల్లు, లింగయ్య, రాములు, రాజవీరు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-18T00:06:07+05:30 IST