Share News

బీజేపీ పన్నాగం బయట పడతుందనే ఎంపీల సస్పెన్షన్‌

ABN , Publish Date - Dec 22 , 2023 | 11:40 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగం బట్టబయలు అవుతుందోనని పార్ల మెంట్‌ సమావేశంలో చర్చకు తావివ్వకుండా విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసిందని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు.

బీజేపీ పన్నాగం బయట పడతుందనే ఎంపీల సస్పెన్షన్‌
సిరిసిల్లలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 22 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగం బట్టబయలు అవుతుందోనని పార్ల మెంట్‌ సమావేశంలో చర్చకు తావివ్వకుండా విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసిందని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ సమావేశంలో విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేయడంతో దాదాపు 150 మంది ఇండియా కూటమిలోని విపక్ష ఎంపీలను బీజేపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజు అన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన తప్పులను కప్పి పుచ్చుకోవడం కోసం పార్లమెంట్‌లో భద్రత వైఫల్యాలను చర్చకు తావివ్వకుండా విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడం అనైతికం అన్నారు. పార్లమెంట్‌లో దాడికి పాల్పడిన వ్యక్తులపై అందుకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారన్నారు. పార్లమెంట్‌లోకి ప్రవేశించడానికి బీజేపీ ఎంపీలు సహకరించారని, దాడికి పాల్పడిన వారు కూడా బీజేపీకి చెందిన వారేనని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు వస్తూన్నాయని బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌, కశ్మీర్‌, ఉగ్రవాదం అంటూ లేవనెత్తి ఎన్నికల్లో గట్టు ఎక్కుతోందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, కార్మికులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంద న్నారు. రాబోయే కాలంలో దేశ ప్రజలు బీజేపీ ప్రభు త్వానికి గుణపాఠం చెబుతారన్నారు. బీజేపీకి బీ టీంగా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్‌ దీనిపై స్పందించడం లేదంటే ఒకే నాణేనికి రెండు వైపులని చెప్పక తప్పదన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్‌రావు, టీపీసీసీ సభ్యుడు నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్‌ సిరిసిల్ల, వేములవాడ పట్టణ అధ్యక్షులు ప్రకాష్‌, వెంకటస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌, ఉపాధ్యక్షులు మల్లేశం, కొమరయ్య, సిరిసిల్ల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, పట్టణ అధ్యక్షుడు నర్సయ్య, చేనేత సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప, పట్టణ అధ్యక్షుడు బాలరాజు, మైనార్టీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు అహ్మద్‌, మహిళా జిల్లా అధ్యక్షురాలు వనితనళినీకాంత్‌, సిరిసిల్ల పట్టణ మహిళా అధ్యక్షురాలు స్వరూపతిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, మాజీ కౌన్సిలర్లు లక్ష్మినారాయణ, శ్రీదేవి, రాష్ట్ర, జిల్లా నాయకులు శ్రీనివాస్‌, నర్సయ్య, వెంకట రమణ, రుక్మిణి, సత్యం, శివప్రసాద్‌, ప్రసాద్‌, వెంకటేశం, మస్తాఫా, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌, లింగా రెడ్డి, ఖాజా, వివిధ మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, సీపీఐ జిల్లా కార్యదర్శి వేణు, పట్టణ కార్యదర్శి రవి, ఏఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దశరథం పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 11:40 PM