Share News

రాజీపడని విప్లవ సంఘాలనే ఆదరించండి

ABN , Publish Date - Dec 13 , 2023 | 11:28 PM

సింగరేణి చరిత్రలో రాజీలేని పోరాటాలు చేసిన చరిత్ర కేవలం విప్లవ కార్మిక సంఘాలకే ఉందని, ఈ సింగరేణి ఎన్నికల్లో విప్లవ కార్మిక సంఘాల కూటమినే ఆదరించాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం(ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ వెంకటేశ్వర్‌రావు, తెలంగాణ గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, శ్రామికశక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు రామన్న అన్నారు.

రాజీపడని విప్లవ సంఘాలనే ఆదరించండి

గోదావరిఖని, డిసెంబరు 13: సింగరేణి చరిత్రలో రాజీలేని పోరాటాలు చేసిన చరిత్ర కేవలం విప్లవ కార్మిక సంఘాలకే ఉందని, ఈ సింగరేణి ఎన్నికల్లో విప్లవ కార్మిక సంఘాల కూటమినే ఆధరించాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం(ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ వెంకటేశ్వర్‌రావు, తెలంగాణ గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, శ్రామికశక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు రామన్న అన్నారు. బుధవారం జీడీకే 1ఇంక్లైన్‌ వద్ద జరిగిన గేట్‌ మీటింగ్‌లో వారు మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మూడు విప్లవ కార్మిక సంఘాలు కూటమిగా పోటీ చేస్తున్నాయన్నారు. సింగరేణి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకరస్థితిలో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితికి పాలకుల విధానాలు ఒకటైతే బూర్జువా సంఘాల ద్రోహ పాత్ర ఉందని కార్మికులు గ్రహించాలన్నారు. పెను ప్రమాదంలో ఉన్న సింగరేణిని ఈ ఎన్నికల్లో దొంగ సంఘాలను ఎన్నుకుని మరింత ప్రమాదంలో పడవేయద్దని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆనాడు విప్లవ కార్మిక సంఘాల నాయకత్వంలో మీ తాతలు, తండ్రులు జంగు సైరన్‌ ఊదారని, అందుకే సింగరేణి నేటికి బ్రతికి బట్టకటిందని యువ కార్మికులకు సూచించారు. ఈ దఫా విప్లవ కార్మిక సంఘాలను ఆధరించాలని కోరారు. ఈ గేట్‌మీటింగ్‌లో నాయకులు కే విశ్వనాథ్‌, ఈ నరేష్‌, ఎస్‌ మల్లేష్‌, రత్న కుమార్‌, ఈ రామకృష్ణ, ఎం రాయమల్లు, ఎం దుర్గన్న, ఎం కొమురయ్య, ప్రసాద్‌, ఐ రాజేశం, శే ఖర్‌, వెంకన్న, సంపత్‌, ఈ రవికుమార్‌, జే రాజన్న పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2023 | 11:28 PM