సీఎంఆర్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:42 AM
నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సీఎంఆర్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కష్టం మిల్లింగ్ రైస్ వానాకాలం యాసంగి పై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
పెద్దపల్లి, డిసెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సీఎంఆర్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కష్టం మిల్లింగ్ రైస్ వానాకాలం యాసంగి పై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌లాల్ పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి మిల్లర్లకు కేటాయించిన ధాన్యం రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించి, రైస్ ఉత్పత్తిలో వేగం పెంచి లక్ష్యం మేరకు సీఎంఆర్ రైస్ డెలివరీ చేయాలన్నారు. సకాలంలో సీఎంఆర్ రైస్ డెలివరీ జరిగే విధంగా జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌లాల్ సంబంధిత అధికారులతో సీఎంఆర్‌పై సమీక్షించి మంత్రి సూచనల మేరకు జిల్లాలో జాప్యం లేకుండా సీఎంఆర్ రైస్ డెలివరీ లక్ష్యం పూర్తి చేయాలని, ప్రతీ రోజు రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యంతో నడిచి రోజువారీ రైస్ డెలివరీ లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, రైస్ డెలివరీలో వెనుక బడుతున్న మిల్లులను గుర్తించి అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.