Share News

బొగ్గు ఉత్పత్తిలో వేగం పెంచండి

ABN , First Publish Date - 2023-12-10T23:51:24+05:30 IST

బొగ్గు ఉత్పత్తిలో వేగం పెంచాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని వెలికితీయాలని డైరెక్టర్‌(పా) బలరాంనాయక్‌ అధికారులకు సూచించారు.

బొగ్గు ఉత్పత్తిలో వేగం పెంచండి

గోదావరిఖని, డిసెంబరు 10: బొగ్గు ఉత్పత్తిలో వేగం పెంచాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని వెలికితీయాలని డైరెక్టర్‌(పా) బలరాంనాయక్‌ అధికారులకు సూచించారు. ఆదివారం ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే ఓసీపీ-5 ఆయన పరిశీలించారు. గ్యాలరీల్లో జరుగుతున్న పనులను, బొగ్గు రవాణా, ఉత్పత్తిని పరిశీలించారు. కోల్‌బెంచ్‌ లు, ఫైర్‌ఫైటింగ్‌పై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నా రు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని వెలికితీయాలని, నిర్ణీత గడువులోగా ఓబీని తొలగించి లక్ష్య సాధనను పూర్తిచేయాలని, ఓసీపీ-5 పరిసర ప్రాంతాల్లో దుమ్ము, దూళి లేవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జీఎం చింతల శ్రీనివాస్‌, ప్రాజెక్టు ఆఫీసర్‌ చంద్రశేఖర్‌, ఇంజనీర్‌ ఎన్‌వీరావు, మేనేజర్‌ అనీల్‌ గబాలే, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:51:27+05:30 IST