Share News

ప్రభుత్వరంగంలో సింగరేణి అగ్రగామి

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:34 AM

రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థల్లో సింగరేణి అగ్రగామిగా నిలువడం సంతోషంగా ఉందని ఆర్‌జీ-1 జీఎం చింతల శ్రీనివాస్‌ అన్నారు. పట్టుదల, అంకిత భావం, క్రమశిక్షణతో పని చేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని ఆయన కార్మికులను కోరారు. ప్రమాదాలు లేని సింగరేణిని నిర్మిద్దామని ఆయన అన్నారు.

ప్రభుత్వరంగంలో సింగరేణి అగ్రగామి
బెలూన్లను వదులుతున్న ఆర్‌జీ-1 జీఎం శ్రీనివాస్‌, అధికారులు

ఆర్‌జీ-1 జీఎం చింతల శ్రీనివాస్‌

- ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు

గోదావరిఖని, డిసెంబరు 23: రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థల్లో సింగరేణి అగ్రగామిగా నిలువడం సంతోషంగా ఉందని ఆర్‌జీ-1 జీఎం చింతల శ్రీనివాస్‌ అన్నారు. పట్టుదల, అంకిత భావం, క్రమశిక్షణతో పని చేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని ఆయన కార్మికులను కోరారు. ప్రమాదాలు లేని సింగరేణిని నిర్మిద్దామని ఆయన అన్నారు. సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా శనివారం జీఎం కార్యాలయం, జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో పతాకావిష్కరణలు చేసిన జీఎం ఈ రెండు సందర్భాల్లో కార్మికులను, అధికారులనుద్దేశించి ప్రసంగించారు. పతాకావిష్కరణ అనంతరం స్టేడియంలో బెలూన్లను గాలిలోకి వదిలి ఆవిర్భావ వేడుకలను జీఎం ప్రారంభించారు. అనంతరం వివిధ డిపార్ట్‌మెంట్లు, సేవా సమితి సభ్యులతో స్టేడియం గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌ను, ఫుడ్‌ కోర్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌జీ-1 పరిధిలోని సింగరేణి కార్మికులకు, సూపర్‌వైజర్లకు, అధికారులకు, సంఘాల ప్రతినిధులకు సింగరేణి ప్రాంత ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. సంస్థలో మరింత ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కార్మికులను కోరారు. సింగరేణి సంస్థలో ఆర్‌జీ-1 ఏరియా మొదటి స్థానంలో నిలిచేందుకు సమిష్టి కృషి ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని, రక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలని జీఎం కార్మికులకు సూచించారు. ఈ సందర్భంగా స్టేడియం గ్రౌండ్స్‌లో పండుగ వాతావరణం నెలకొన్నది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కార్మిక కుటుంబాల్ని ఆకట్టుకున్నాయి. వేడుకల్లో రామగుండం రీజియన్‌ జీఎం(సేఫ్టీ) సాంబయ్య, జీఎం(క్వాలిటీ) కేవీరావు, ఎస్‌ఓటూ జీఎం రాంమోహన్‌, ఏజీఎం(పర్సనల్‌) లక్ష్మీనారాయణ, ఏజీఎం (ఈఅండ్‌ఎం) రాంమూర్తి, పీఓ చంద్రశేఖర్‌, ఏజీఎం(ఐఈడీ) ఆంజనేయులు, డీజీఎం(ఫైనాన్స్‌) ధనలక్ష్మిభాయి, డీజీఎం(సివిల్‌) నాగేశ్వర్‌రావు, డీవైసీఎంఓ కిరణ్‌ రాజ్‌కుమార్‌, ఎన్విరాన్‌మెంట్‌ అధికారి ఆంజనేయప్రసాద్‌, డీజీఎం(ఏరియా వర్క్‌షాప్‌) మదన్మోహన్‌, ఎస్టేట్‌ అధికారి బాల సుబ్రహ్మణ్యం, అభిలాష్‌, పర్చేస్‌ అధికారి శ్రీనివాస్‌, సీనియర్‌ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, పర్సనల్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌, సీనియర్‌ పీఓలు, సారంగపాణి, శ్రావణ్‌, నరేన్‌ చక్రవర్తి, పలు డిపార్ట్‌మెంట్ల ఉన్నతాధికారులు, మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:34 AM