Share News

సింగరేణి ఎన్నికలు యఽథావిధిగా నిర్వహించాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:51 AM

సింగరేణిలో కేంద్ర కార్మికశాఖ షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 27న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని సింగరేని కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య అన్నారు. ఎన్నికలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మళ్లీ కోర్టులో కేసు వేయడం వెనుక ఐఎన్‌టీయూసీ హస్తం ఉందని వారు ఆరోపించారు.

సింగరేణి ఎన్నికలు యఽథావిధిగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీతారామయ్య

- కోర్టుకు వెళ్లడం వెనుక ఐఎన్‌టీయూసీ హస్తం ఉంది

- ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య

గోదావరిఖని, డిసెంబరు 17: సింగరేణిలో కేంద్ర కార్మికశాఖ షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 27న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని సింగరేని కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య అన్నారు. ఎన్నికలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మళ్లీ కోర్టులో కేసు వేయడం వెనుక ఐఎన్‌టీయూసీ హస్తం ఉందని వారు ఆరోపించారు. ఆదివారం స్థానిక భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన ఏఐటీయూసీ ఆర్‌జీ-1 బ్రాంచ్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. కేసును వెంటనే వాపసు తీసుకుని ఎన్నికలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని వారు డిమాండ్‌ చేశారు. నాలుగేళ్ల క్రితమే జరుగాల్సిన సింగరేణి గుర్తింపు ఎన్నికలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయని, ఇటు టీబీజీకేఎస్‌, అటు యాజమాన్యం, ప్రభుత్వం కలిసి వాటి అనుబంధ సంఘానికి లబ్ది చేకూరే విధంగా ఎన్నికల వాయిదాలు కోరుతూ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కరోనా కాలమని ఒక సారి, శాంతి భద్రతల సమస్యలని మరోసారి, అసెంబ్లీ ఎన్నికలని ఇంకోసారి అని రకరకాల సాకులు చెబుతూ ఎన్నికలను వాయిదా వేస్తున్నారన్నారు. ఏఐటీయూసీ న్యాయ పోరాటం కారణంగా ఈ నెల 27న ఎన్నికలు జరుపాలని మై కోర్టు తీర్పునిచ్చిందని, ప్రచారాలు జరుగుతునాయని, ఎన్నికల నిర్వహణ కూడా మొదలైందని, ఇప్పుడు తిరిగి హై కోర్టుకు వెళ్లడం విడ్డూరమన్నారు. ఇలాంటి పన్నాగాలు చేస్తున్న వారి నిజ స్వరూపాల్ని కార్మికులు గమనించాలని కోరారు. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిగితే ఏఐటీయూసీ గెలుస్తుందనే భయంతోనే అప్పుడు టీబీజీకేఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్‌, దాని అనుబంధ సంఘం ఐఎన్‌టీయూసీ ఇలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. టీబీజీకేఎస్‌ విధానాల వల్ల బీఆర్‌ఎస్‌ ఎలా కోల్‌బెల్ట్‌లో పతనమైందో కాంగ్రెస్‌ అదిష్టానం గమనించి వ్యవహరించాలని వారు కోరారు. న్యాయబద్దంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు యధావిదిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అధికారం కోసం పాకులాడే యూనియన్లను, సర్కారు సంఘాలను, ఈ ఎన్నికల్లో ఓడించాలని, ఏఐటీయూసీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్‌ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్‌, కేంద్ర కార్యదర్శి కే స్వామి, బ్రాంచ్‌ కార్యదర్శి ఆరెల్లి పోషం, నాయకులు సంకె అశోక్‌, రంగు శ్రీనివాస్‌, ఎస్‌ వెంకటరెడ్డి, కన్నం లక్ష్మీనారాయణ, మానాల శ్రీనివాస్‌, పర్లపల్లి రామస్వామి, పీ నాగేందర్‌, సంపత్‌, మల్లేష్‌, సయ్యద్‌, సోహెల్‌, సత్యనారాయణ, దేవయ్య, రాజు, నరేష్‌, రాజయ్య, మల్లయ్య, గౌస్‌, శ్రీనివాస్‌, రమేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:51 AM