సాదాసీదాగా మున్సిపల్‌ సమావేశం

ABN , First Publish Date - 2023-01-26T00:42:03+05:30 IST

: వేములవాడ పురపాలక సంఘం పాలకవర్గం సాధారణ సమావేశం సాదాసీదాగా సాగింది. చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు.

సాదాసీదాగా మున్సిపల్‌ సమావేశం
మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ మాధవి

వేములవాడ, జనవరి 25 : వేములవాడ పురపాలక సంఘం పాలకవర్గం సాధారణ సమావేశం సాదాసీదాగా సాగింది. చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. ఎజెండా ప్రకారం అభివృద్ధి, నీటి సరఫరా, పారిశుధ్యం తదితర అంశాలపై చర్చించారు. మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో మున్సిపల్‌ తరుపున చేయాల్సిన ఏర్పాట్లు, పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై చర్చించి ఎజెండా అంశాలపై ఆమొదం తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ తిరుపతి, మున్సిపల్‌ ఏఈ నర్సింహస్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:42:03+05:30 IST