Share News

ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి

ABN , First Publish Date - 2023-11-27T00:10:07+05:30 IST

ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని సీపీ అభిషేక్‌ మొహంతి సాయుధ బలగాలకు సూచించారు. కమిషనరేట్‌ కేంద్రంలోనిలోని జాన్‌ విల్సన్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ హాలులో ఆదివారం సీపీ స్పెషల్‌ యాక్షన్‌ టీంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
స్పెషల్‌యాక్షన్‌టీం పోలీసులతో మాట్లాడుతున్న పోలీస్‌ కమిషనర్‌ అభిషేక్‌ మొహంతి

- సీపీ అభిషేక్‌ మొహంతి

కరీంనగర్‌ క్రైం, నవంబరు 26: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని సీపీ అభిషేక్‌ మొహంతి సాయుధ బలగాలకు సూచించారు. కమిషనరేట్‌ కేంద్రంలోనిలోని జాన్‌ విల్సన్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ హాలులో ఆదివారం సీపీ స్పెషల్‌ యాక్షన్‌ టీంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గడిచిన నెల రోజుల్లో స్పెషల్‌ యాక్షన్‌ టీంలు కమిషనరేట్‌ వ్యాప్తంగా అద్భుతంగా పనిచేశాయన్నారు. రాబోయే మూడు రోజులు ఎన్నికల ప్రక్రియలో చాలా కీలకమని, రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలన్నారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వారికి విధులు కేటాయిస్తామన్నారు. వీరికి అవసరమయిన రైట్‌ గేర్‌, ఇతర పూర్తి సామగ్రిని సమకూర్చామని, విధుల్లో పూర్తి స్వేచ్ఛను కలిపించామన్నారు. ఎన్నికలవేళ ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ సి రాజు(పరిపాలన), రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌లు శేఖర్‌బాబు, రజినీకాంత్‌, శ్రీధర్‌ రెడ్డి, సురేష్‌ పాల్గొన్నారు.

ఫ డ్రోన్‌, స్కై బెలూన్‌ల వినియోగంపై నిషేధం

కమిషనరేట్‌ పరిధిలో సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా, భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్‌, రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్స్‌, రిమోట్‌ కంట్రోల్‌ మైక్రోలైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ల వినియోగంపై నిషేధం విధిస్తున్నామని సీపీ అభిషేక్‌ మొహంతి ఓ ప్రకటనలో తెలిపారు. కరీంనగర్‌ ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి 12 కిలోమీటర్ల పరిధి వరకు, స్కై ఎయిర్‌ బెలూన్లు కిలోమీటర్‌ పరిధి వరకు ఈ నిషేధం వర్తిస్తుందన్నారు. ఈ నిషేధాజ్ఞలు సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్‌ 188, 121, 121(ఎ), 287, 336, 337, 338 చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-11-27T00:10:11+05:30 IST