శంభో శివ శంభో
ABN , First Publish Date - 2023-02-19T01:27:41+05:30 IST
శివ నామస్మరణతో జిల్లా మార్మోగింది. శనివారం మహా శివరాత్రి కావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు మహా శివ రాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆల యాల ఎదుట భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులు మట్టితో శివ లింగాలు, ప్రమిదలు రూపొందించి ఆలయ ప్రాంగణాల వద్ద జాగరణ పాటించారు. జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల్లో రాత్రి 12 గంటలకు బిల్వ పత్ర సమర్పణ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏలాంటి ఆవాంచనీయ ఘటనలు జరుగకుండా ఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు అన్ని ఆలయాల వద్ద బందోబస్తు నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టారు.
శివనామస్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు
దుబ్బరాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం
పూజలు నిర్వహించిన మంత్రి ఈశ్వర్, జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
కోటిలింగాల, ధర్మపురిలో భక్తుల పుణ్య స్నానాలు
జగిత్యాల టౌన్, ఫిబ్రవరి 18 : శివ నామస్మరణతో జిల్లా మార్మోగింది. శనివారం మహా శివరాత్రి కావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు మహా శివ రాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆల యాల ఎదుట భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులు మట్టితో శివ లింగాలు, ప్రమిదలు రూపొందించి ఆలయ ప్రాంగణాల వద్ద జాగరణ పాటించారు. జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల్లో రాత్రి 12 గంటలకు బిల్వ పత్ర సమర్పణ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏలాంటి ఆవాంచనీయ ఘటనలు జరుగకుండా ఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు అన్ని ఆలయాల వద్ద బందోబస్తు నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టారు.
కిక్కిరిసిన దుబ్బరాజన్న శైవక్షేత్రం
సారంగాపూర్: మహ శివరాత్రిని పురస్కరించుకుని దుబ్బ రాజన్న ఆల యం శనివారం భక్తులతో కిక్కిరిసింది. శనిత్రయోదశి కావడంతో పెద్ద సం ఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వేకువ జామున నుంచేభక్తులు స్వామి వా రిని దర్శించుకున్నారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కోడే మొక్కలు చెల్లిం చుకున్నారు. రోజంత ఉపవాసంతో ఉన్న భక్తులు దీపాలు వెలిగించి జా గరణ చేశారు. ఆలయ అధికారుల ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో భక్తులు అసౌకర్యాలకు లోనయ్యారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ జిల్లా అద్యక్షుడు సత్యనారాయణ రావు, జగిత్యాల బల్దియా మా జీ చైర్‌పర్సన్ బోగ శ్రావణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
దుబ్బరాజేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ భాస్కర్ అన్నారు. శనివారం మహ శివరాత్రి పర్వ దినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమోరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని భక్తులకు ఏమైన ఇబ్బందులు ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్‌లో సంప్రదించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రకాష్, రూరల్ సీఐ కృష్ణ కుమార్, అరిఫ్ అలీఖాన్, ఎస్సై మనోహర్‌రావు, సిబ్బంది ఉన్నారు.
గర్బగుడిలో విద్యుత్ లేకపోవడంపై ఎమ్మెల్సీ ఆగ్రహం
దుబ్బ రాజేశ్వర ఆలయ గర్బగుడిలో కరెంట్ లేక పోవడంతో ఆలయ, వి ద్యుత్ అధికారులపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహ శి వరాత్రి పర్వదినం సంధర్బంగా జాతర బ్రహోత్సవాలను అంగరంగ వైభ వంగా నిర్వహించాల్సింది ఉండగా ప్రధాన ఆలయంలోనే కరెంట్ లేకపో వడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకో వాలని అన్నారు.
కోటిలింగాలలో పోటెత్తిన భక్తులు
వెల్గటూర్: కోటిలింగాలలో మహా శివరాత్రి వేడుకలు శనివారం వైభవో పేతంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి భక్తుల శివ నామ స్మరణతో మార్మోగింది. పవిత్ర గోదావరి నదిలో స్నానాలు చేసిన భ క్తులు ఆలయానికి తరలి వచ్చారు. అర్చకులు నాగరాజు శర్మ, సంజీవ్ శర్మ. అన్వేష్ శర్మల మంత్రోచ్ఛరణల మధ్య పూజలు నిర్వహించారు. భక్తులు క్యూలైన్‌లో నిలబడి స్వామి వారలను దర్శించుకున్నారు. ఆలయ ఇన్‌చార్జి ఈవో మారుతీరావు, ఆలయ మాజీ చైర్మన్ నారాయణ రావు ఏర్పాట్లను ప ర్యవేక్షించారు. సీఐ కోటేశ్వర్, ఎస్సై నరేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బం దోబస్తు ఏర్పాటు చేశారు. మహా శివరాత్రి సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీ కోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఫమండలంలోని వెంకటాపూర్, ముత్తునూర్, కొండాపూర్ ఆలయాలలో స్వామి వారలకు నిత్య పూజలు అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాలను అందంగా విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు.
ఽశ్రీ కోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి
మహా శివరాత్రి సందర్భంగా శనివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొ ప్పుల ఈశ్వర్ దంపతులు కోటిలింగాలలో శ్రీ కోటేశ్వర స్వామిని దర్శిం చు కొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కొప్పుల దంపతులకు అర్చ కులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించు కున్న మంత్రి దంపతులకు అర్చకులు ఆశీర్వదించారు. ఏఎంసీ చైర్మన్ పత్తి పాక వెంకటేష్ జ్ఞాపికను అందజేశారు. మంత్రి దదంపతులు గోదావరిలో బోటింగ్ చేసి అవతలి ఒడ్డున గల లక్షెట్టిపేట గంగా మాతను దర్శించుకు న్నారు. జడ్పీటీసీ సుధా రామస్వామి, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాంచంద్రం గౌడ్ పాల్గొన్నారు.
ధర్మపురిలో వైభవంగా ఉత్సవాలు
ధర్మపురి: ధర్మపురిలో మహా శివరాత్రి ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి, అక్కపల్లి రాజ రాజేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేద పారాయ ణదారు పాలెపు ప్రవీణ్‌శర్మ, వేదపండితులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, శివ కల్యాణం జరిపించారు. మండలంలోని అన్ని శివాలయాల్లో అర్చకులు మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గోదావరి నదిలో స్నానాలు చేసిన భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామి వారిని ద ర్శించుకున్నారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆల యాల పక్షాన సిబ్బంది భక్తుల కోసం టెంట్లు వేసి, మంచి నీటి సౌకర్యం క ల్పించి తగు సేవలు అందించారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్థానిక రామలింగేశ్వరస్వామి, అక్కెపల్లి రాజేశ్వర స్వామి ఆలయంలో దర్శించుకున్నారు. శివ కల్యాణోత్సవాలకు ఆయా ఆల యాల పక్షాన స్వామి వారలకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
వైభవంగా శివ పార్వతులు కల్యాణం
స్థానిక శివాలయాల్లో శివ పార్వతుల కల్యాణోత్సవాలు శనివారం అత్యం త వైభవంగా నిర్వహించారు. ఆస్థాన వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, బొజ్జ సంపత్ కుమార్, తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి కల్యాణం జరిపించారు.
మంత్రి ఈశ్వర్ దంపతులు పూజలు
ధర్మపురి ఆలయాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంప తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల వద్ద మంత్రి దంపతులకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దంపతులు స్వామి వారలను దర్శనం చేసుకున్నారు. సీఐ బిళ్ల కోటేశ్వర్ నే తృత్వంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చై ర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, మున్సిపల్ చై ర్‌పర్సన్ సంగి సత్యమ్మ, డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కమిష నర్ రమేష్, ఎంపీపీ, జడ్పీటీసీలు చిట్టిబాబు, అరుణ, రాజేందర్, ఏఎంసీ చై ర్మన్ రాజేష్‌కుమార్, వైస్‌చైర్మన్ సునీల్‌కుమార్, మున్సిపల్ వైస్‌చైర్మన్, ఆలయ రినోవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య పాల్గొన్నారు.