మొక్కు ‘బడి’ పనులే

ABN , First Publish Date - 2023-03-05T01:44:11+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ కు దీటుగా తీర్చిదిద్ది నాణ్యమైన బోధన అందించేందుకు చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం క్షేత్ర స్థాయిలో లక్ష్యం దిశగా సాగడం లేదు.

మొక్కు ‘బడి’ పనులే

- జిల్లాలో నత్తనడకన ‘మన ఊరు-మన బడి’

- 26 పాఠశాలలకు పూర్తికాని టెండర్లు

- పనులు అంతంతమాత్రంగానే చేస్తున్న కాంట్రాక్టర్లు

- విద్యార్థులకు తప్పని తిప్పలు

జగిత్యాల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ కు దీటుగా తీర్చిదిద్ది నాణ్యమైన బోధన అందించేందుకు చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం క్షేత్ర స్థాయిలో లక్ష్యం దిశగా సాగడం లేదు. గత యేడాది మార్చి మాసంలో కార్యక్రమాన్ని ప్రారంభించగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో పనులు ప్రారంభం కాగా, మరికొన్నింటిని పనులు పునాది దశలోనే ఉన్నాయి. ఈ పనులను స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ, రూ. 30 లక్షలు పైబడిన పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు చేపతున్నారు. అధికారుల నిర్లక్ష్యమో, కాంట్రాక్టర్ల అలసత్వ మో కానీ వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే నాటికి పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. కొన్ని పూర్తయినప్పటికీ ప్రజాప్రతినిధు లు అందుబాటులో లేక ప్రారంభానికి నోచుకోవడం లేదు.

మోడల్‌ పాఠశాలల పరిస్థితి అంతే..

మన ఊరు - మన బడి కార్యక్రమం కింద ప్రతీ మండలానికి రెండు చొప్పున 36 పాఠశాలలను డిసెంబరులోనే ప్రారంభించడానికి అధికారులు ప్రయత్నించారు. అయినప్పటికీ పనులు పూర్తి స్థాయిలో కాకపోవడం, ప్ర జాప్రతినిధులు షెడ్యూల్‌ ఇవ్వకపోవడం వల్ల వాయిదా పడింది. ఇటీవల జిల్లా కేంద్రంతో పాటు జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజక వర్గాల్లో పలు పాఠశాలలను ప్రారంభించారు. ఇప్పటివరకు జిల్లాలో 8 పాఠశా లలను ప్రారంభించారు. మరో 12 పాఠశాలలు పనులు పూర్తయి ప్రారం భానికి సిద్ధంగా ఉన్నాయి. పనులు పూర్తయిన పలు ఉన్నత పాఠశాలల్లో రాష్ట్ర స్థాయి నుంచి ఫర్నిచర్‌ రావాల్సి ఉండడంతో పెండింగ్‌లో ఉన్నాయి. ఫర్నిచర్‌ రాకపోవడంతో సంబంధిత పాఠశాలలను ప్రారంభించడం లేదు. పనులు పూర్తయినప్పటికీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతి నిధులు షెడ్యూల్‌ ఇవ్వకపోవడం వల్ల ప్రారంభం కావడం లేదు.

నత్తనడకన పనులు..

జిల్లా వ్యాప్తంగా మన ఊరు మన బడి కార్యక్రమం కింద మొదటి విడతగా 274 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో కోరుట్ల మండ లంలోని ఒకే ఒక పాఠశాలలకు ప్రభుత్వం నుంచి పరిపాలన పరమైన అనుమతి లభించలేదు. సంబంధిత పాఠశాలల ఎస్‌ఎంసీ కమిటీలు ప్రత్యేక బ్యాంకు ఖాతాలను పనుల నిమిత్తం తెరిచాయి. జిల్లాలో ఎంపికై న పాఠశాలల్లో రూ. 30 లక్షల్లోపు పనులు గల 218 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో పనులు ప్రారంభించినప్పటికీ 16 పాఠశాల ల్లో ఎప్పటికప్పుడు ఎంబీ రికార్డులు పూర్తి చేయడం లేదు. జిల్లాలోని ధర్మ పురి, గొల్లపల్లి, కథలాపూర్‌, కోరుట్ల, పెగడపల్లి, వెల్గటూరు మండలాల్లో పలు పాఠశాలల పనులను ఎంబీ రికార్డుల్లోకి ఎక్కించనట్లు అధికారులు గుర్తించారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద రూ. 30 లక్షలకు పైగా పనులను చేపట్టాల్సిన పాఠశాలలను అధికారులు ప్రత్యేకం చేశారు. టెండర్ల ప్రక్రియను నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులను అప్పగించడానికి నిర్ణయించారు. జిల్లాలో రూ. 30 లక్షలకు పైగా పనులు గల పాఠశాలలు 55 ఉండగా, ఇందులో 29 పాఠశాలలకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాం ట్రాక్టర్లకు అగ్రిమెంట్లు అందించారు. అగ్రిమెంట్లు పొందిన పాఠశాలల్లో బీర్‌పూర్‌ మండలంలోని ఒకే ఒక పాఠశాలలో పనులు వేగవంతంగా జ రుగుతున్నట్లు విద్యాశాఖ రికార్డులు తెలుపుతున్నాయి. 28 పాఠశాలల్లో పనులు ప్రారంభం కాగా 14 పాఠశాలల పనులు ఎంబీ రికార్డులకు ఎక్క డం లేదు. జిల్లాలో రూ. 30 లక్షలకు పైబడి పనులు గల 26 పాఠశాల లకు ఇప్పటివరకు కనీసం టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. పలు పాఠశా లల్లో పనుల నిర్వహణకు అధికారులు నాలుగు, అయిదు పర్యా యాలు టెండర్లను ఆహ్వానించినప్పటికీ కాంట్రాక్టర్లు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదన్న అభిప్రాయాలున్నాయి. పలు పాఠశాలల్లో పనులు పూర్తయి ఆన్‌ లైన్‌లో నమోదు చేసినప్పటికీ బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల కాం ట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీం తో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి మన ఊరు మన బడి కా ర్యక్రమం కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరడంపై అనుమానాలు నెలకొంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు పనులు వేగ వంతం చేయాలని పలువురు కోరుతున్నారు.

పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

- అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్ర మం పనులను మరింత వేగవంతం చేయాలి. జిల్లాలో కొన్ని పాఠశాలల్లో పనులు పూర్తయినప్పటికీ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు షె డ్యూల్‌ ఇవ్వకపోవడం ప్రారంభానికి నోచుకోకపోవడం విచారకరం. ప్రభు త్వం దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ లక్ష్యం మేరకు పూర్తి చేస్తాం

జగన్‌ మోహన్‌ రెడ్డి, జిల్లా విద్యాధికారి

జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద 274 పాఠశాలలను ఎంపిక చేశాము. వీటికి సంబంధించి నిధులు మంజూరు అయ్యాయి. ఇప్పటివరకు ఎనిమిది పాఠశాలల్లో పనులు పూర్తి చేసి ప్రారంభించాము. మరో 12 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే విద్యా సం వత్సరం నాటికి పాఠశాలలను సిద్ధం చేసే దిశగా పనులు చేస్తున్నాము.

Updated Date - 2023-03-05T01:44:11+05:30 IST