రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలి
ABN , First Publish Date - 2023-01-18T00:17:08+05:30 IST
భూగర్భ గనుల్లో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని వెలికితీయాలని అధికారులకు సింగరేణి డైరెక్టర్(ఈఅండ్‌ఎం) సత్యనారాయణ సూచించారు.
గోదావరిఖని, జనవరి 17: భూగర్భ గనుల్లో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని వెలికితీయాలని అధికారులకు సింగరేణి డైరెక్టర్(ఈఅండ్‌ఎం) సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 11ఇంక్లైన్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు రక్షణ చర్యలను పటిష్టపర్చాలని, భూగర్భ గనుల్లో పని స్థలాల్లో గాలి, నీరు వెలుతురు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం గని వద్ద ఉన్న మ్యాన్‌రైడింగ్ సిస్టం, కన్వేయర్ బెల్ట్, యంత్రాల పనితీరును ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ, 11గ్రూప్ ఏజెంట్ చిలుక శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ రాంమూర్తి, గ్రూప్ ఇంజనీర్ రాందాస్, పిట్ ఇంజనీర్ రాజబాబు పాల్గొన్నారు.