Share News

ఆందోళనబాటలో గ్రామీణ డాక్‌సేవకులు

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:54 PM

తోక లేని పిట్టను తొంబై ఆమడల దూరం తీసుకు వెళ్లే గ్రామీణ డాక్‌సేవలు ఆందోళన బాటపట్టారు. పేరుకే కేంద్ర పరిధిలో పనిచేస్తున్న తపాల శాఖ ఉగ్యోగులు కానీ వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు కాదు.

ఆందోళనబాటలో గ్రామీణ డాక్‌సేవకులు

భగత్‌నగర్‌, డిసెంబరు 18: తోక లేని పిట్టను తొంబై ఆమడల దూరం తీసుకు వెళ్లే గ్రామీణ డాక్‌సేవలు ఆందోళన బాటపట్టారు. పేరుకే కేంద్ర పరిధిలో పనిచేస్తున్న తపాల శాఖ ఉగ్యోగులు కానీ వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు కాదు. గ్రామాల్లో ఉన్న గ్రామ సచివాలయాల ఉద్యోగుల కంటే తక్కువ వేతనం తీసుకుని నానా చాకిరీ చేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌కు ఉండేంత ఆత్మీయ సంబంధాలు ఉన్నాయంటే ఒక్క గ్రామీణ డాక్‌సేవలకే అన్న విషయం అతిశయోక్తి కాదు. కేంద్రప్రభుత్వ శాఖలలో రైల్వే శాఖ తర్వాత అతిపెద్ద శాఖగా తపాల శాఖకు పేరుంది. దేశంలో ప్రతి వ్యక్తికి సేవ అందించే ఘనత మాత్రం గ్రామీణ డాక్‌ సేవ లకులదే. ఇందులో పనిచేసే వారంతా కేంద్రప్రభుత్వ ఉద్యోగులనుకుంటారు కానీ 80 శాతం మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు. గ్రామీణ డాక్‌ సేవలకు అందే వేతనం మాత్రం శతాబ్ధకాలం గడిచినా 10 వేల రూపాయలు మాత్రమే.

- విధులు ఎక్కువే

1850-1990 దశాబ్ధకాలం క్రితం గ్రామీణ డాక్‌సేవలకు ఉత్తరాల బట్వాడ మాత్రమే ఉండేది. 1990-2023 వరకు ప్రత్యేక నియామకపు విధానాలు వచ్చి మెరి ట్‌ ఆధారంగా నియమకాలు చేపడుతున్నారు. గ్రామీణ డాక్‌ సేవకులు ఉత్తరాల బట్వాడ, చిన్న మొత్తాల పొదుపు సేవింగ్‌ అకౌంట్స్‌, రికరింగ్‌ డిపాజిట్లు, టైం డిపా జిట్లు, సుకన్యసమృద్ధి యోజన, ఆర్‌పిఎల్‌ఐ, పీఎల్‌ఐ, పిఎం జీవితబీమా, సురక్షా బీమాయోజన, జీవనజ్యోతిబీమా, బిజినెస్‌ పోస్ట్‌, మీడియా పోస్ట్‌, ఈ కామర్స్‌, పేమెంట్‌ బ్యాంకు సేవలు, ఉపాధిహామిచెల్లింపులు, వృదాప్య పింఛన్లు, ఆధార్‌ సేవలు,అన్ని బ్యాంకు ఖాతాల చెల్లింపులు, సర్వీస్‌ సెంటర్ల సేవలన్నీ చేస్తున్నారు.

- గ్రామీణ తపాలా కార్యాలయాలు

గ్రామీణ డాక్‌సేవలు గ్రామీణ తపాలా కార్యాలయాలను తమ ఇండ్లలోనే నిర్వహిస్తున్నా వారికిచ్చే అద్దె మెయింటెనెన్స్‌ మాత్రం 250 రూపాయలు మాత్రమే గ్రామీణ డాక్‌ సేవలను మూడు కేటగీరిలుగా విభజించి లెవల్‌-1 10,000 రూపాయలు, లేవల్‌-2 12,000 రూపాయలు, లేవల్‌ -3లో 14,500 రూపాయలను 2018 సంవత్సం నుంచి ఇస్తున్నారు. వీరందరికీ ఎంప్లాయిమెంట్‌ రూల్స్‌ ఏవి వర్తించవు. గ్రాట్యుటీ, పెన్షన్‌, మెడికల్‌, ఈఎస్‌ఐ, సిజిఈఎస్‌ఐ, పిఎఫ్‌, చిల్ట్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌ లాంటి సౌకర్యాలేవి లేవు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వేతన సవరణలో గ్రామీణ తపాల సేవకులు లేరు. వీరి కోసం ప్రత్యేక కమిటీ వేస్తారు. ఏళ్లతరబడి పోరాటాలుచేస్తున్నా వీరిని పట్టించుకునే వారు లేరు. తపాలా శాఖకు పునాదులు గ్రామీణ డాక్‌ సేవకులైన వీరిని ఆదుకోవాలని జిడిఎస్‌ గ్రామీణ డాక్‌ సేవకులు కోరుతున్నారు.

- ఉద్యోగులకు అందే ప్రయోజనాలు కల్పించాలి

- ఎం ఎల్లయ్య, జీడీఎస్‌ అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని ప్రయోజనాలు గ్రామీణ డాక్‌ సేవకులకు కల్పించాలి. పెన్షన్‌తో పాటు సీనియర్‌ జిడిఎస్‌ ఉద్యోగులకు 12, 24,36 సంవత్సరాల సర్వీస్‌కు అదనపు ఇంక్రిమెంట్‌ అందించాలి. గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, గ్రాట్యుటీ ఐదు లక్షలకు పెంచాలి.

- ఆరోగ్యపరంగా ఆదుకోవాలి

- ఎం సుధాకర్‌, జిడిఎస్‌ ప్రధాన కార్యదర్శి

జిడిఎస్‌ ఉద్యోగులతో పాటు, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలి. పెయిడ్‌ లీవులు 180 రోజుల వరకు దాచుకుని నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించాలి. కమలేష్‌ చంద్రకమిటీ సిఫారసు చేసిన బంచింగ్‌ అమలు చేయాలి. ఎస్‌డిబిఎస్‌కు జిడిఎస్‌ కంట్రిబ్యూషన్‌ పదిశాతం, తపాలశాఖ కంట్రిబ్యూషన్‌ పది శాతం అందించి తాత్కాలిక పెన్షన్‌ సౌకర్యం కల్పించాలి. రెగ్యులర్‌ జిడిఎస్‌లు లీవుపెడితే వర్క్‌లోడ్‌తో సంబంధం లేకుండా సబ్‌స్టిట్యూట్‌లను ఇవ్వాలి. ఇన్సెంటివ్‌ కమిషన్‌ పద్ధతి రద్దు చేసి జిడిఎస్‌లు చేసే ప్రతి పనిని వర్క్‌లోడ్‌లోకి తీసుకోవాలి. గ్రామీణ డాక్‌సేవలు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులను నిలిపివేయాలి.

Updated Date - Dec 18 , 2023 | 11:54 PM