రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
ABN , First Publish Date - 2023-03-18T23:35:42+05:30 IST
కరీంనగర్ ప్రగతినగర్‌లో శుక్రవారం రాత్రి రోడ్డుపై ఆవును తప్పించబోయి వెన్నం సాత్విక్(15) బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు.

కరీంనగర్ క్రైం, మార్చి 18 : కరీంనగర్ ప్రగతినగర్‌లో శుక్రవారం రాత్రి రోడ్డుపై ఆవును తప్పించబోయి వెన్నం సాత్విక్(15) బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి అనంతరం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమద్యలో శనివారం ఉదయం 4:30 గంటలకు సాత్విక్ మృతి చెందాడని రెండో ఠాణా పోలీసులు తెలిపారు. కొత్తపల్లి మండలం నాగుల మల్యాలకు చెందిన సాత్విక్ ఈ నెల 15న కరీంనగర్ సప్తగిరి కాలనీలోని అతని బంధువుల ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తన తల్లిని రాంగనర్ స్టేజీ నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు బైక్‌పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి తండ్రి వెన్నం రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.