పోడు భూములపై హక్కులు కల్పించాలి
ABN , First Publish Date - 2023-03-20T00:26:13+05:30 IST
పోడు భూములపై హక్కులు కల్పించాలని నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ కన్వీనర్ గోమాస శ్రీనివాస్ పి లుపునిచ్చారు.

కళ్యాణ్‌నగర్, మార్చి 19: పోడు భూములపై హక్కులు కల్పించాలని నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ కన్వీనర్ గోమాస శ్రీనివాస్ పి లుపునిచ్చారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ప్రజా సంఘాలు రాజ్యాంగాన్ని కాపాడడం కోసం పోరాటం చేస్తున్నాయని, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీలు వేదికల ద్వారా పోరాటాలు చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నారని, నేతకాని సంఘం ఆధ్వర్యంలో కూడా సామాజిక సమతూల్యం కోసం కృషి చేస్తుందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో రాజకీయంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్‌తో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలు నేతకాని మహర్ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతంలో నివసిస్తున్న నేతకాని, గిరిజనేతరులకు పోడు భూములకు భూ యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తూ క్రయ విక్రయాలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని, గోదావరి పరివాహక ప్రాంతంలో ముపునకు గురైన బాధితులను ఆదుకోవాలని, సింగరేణిలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంతో పాటు ఇండ్లు నిర్మించుకోవడానికి స్థలాలు ఇవ్వాలని డివుమాండ్ చేశారు. ఎస్‌సీల జనాభా ప్రకారం రిజర్వేషన్‌ను 20శాతానికి పెంచాలని, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఎస్‌సీలందరికి ఐటీడీఏ తరహా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, బీసీ జనగణపై పార్లమెంట్‌లో తీర్మాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజమల్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రియాజ్ అహ్మద్, బండారి కనకయ్య, తిరుపతి, ఎల్లయ్య, ప్రదీప్, నాగరాజు, రాజమౌళి, గంగారాం, శ్రీనివాస్, వాసుదేవ్, అనుష, విజయ, భూమయ్య, రాజన్న, ముడిమడుగుల మల్లన్న పాల్గొన్నారు.